Begin typing your search above and press return to search.

అలా మాయ చేస్తే 10వేలు ఫైన్ త‌ప్ప‌దు

By:  Tupaki Desk   |   11 Jun 2018 5:47 AM GMT
అలా మాయ చేస్తే 10వేలు ఫైన్ త‌ప్ప‌దు
X
ఆధార్ త‌ర్వాత ఎక్కువ మందికి ఉండే అధికారిక కార్డు అంటే పాన్ కార్డ్ గా చెబుతారు. అయితే.. త‌మ అవ‌స‌రాల కోసం.. అడ్డ‌దారులు తొక్కేందుకు వీలుగా కొంత‌మంది ఒక‌టి కంటే ఎక్కువ పాన్ కార్డులు అప్లై చేశారు. ఇలాంటి వారికి ముకుతాడు వేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ప్ర‌తి ఒక్క‌రు త‌మ పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక‌వేళ‌.. ఒక‌టి కంటే ఎక్కువ పాన్ కార్డులు మీకుంటే వాటిని వెంట‌నే ప్ర‌భుత్వానికి తిరిగి ఇచ్చేయ‌టం మంచిది. లేదంటే భారీ జ‌రిమానాను చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌టికి మించిన పాన్ కార్డులు ఉన్న వారి విష‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తోంది.

ప్ర‌తి ఒక్క పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసుకోవాల్సి ఉండ‌టంతో.. ఒక‌రి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్న వారు ఇట్టే దొరికిపోవ‌టం ఖాయ‌మంటున్నారు. ఆధార్ తో అనుసంధానం చేసే క్ర‌మంలో ఒక‌టి కంటే ఎక్కువ ఉన్న వారు దొరికిపోవ‌టం ఖాయం.

ఆదాయ‌ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 139ఎ ప్ర‌కారం ఏ వ్య‌క్తికి ఒక‌టి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండ‌కూడ‌దు. ఒక‌వేళ ఉంటే.. సెక్ష‌న్ 272బి ప్రకారం రూ.10వేల జ‌రిమానా విధించే వీలుంది. క్రెడిట్ కార్డు స్కోర్ స‌రిగా లేని వారు కొత్త రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్పుడు పాన్ కార్డుల్ని కొత్త‌గా ప‌ట్టిస్తుంటారు. అదే స‌మ‌యంలో మ‌రికొంద‌రు త‌మ పాన్ కార్డు పోయిన‌ప్పుడు పాతవాటిని తిరిగి తెచ్చుకోకుండా కొత్త వాటి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు సైతం త‌మ ద‌గ్గ‌ర అద‌నంగా ఉన్న కార్డుల్ని ప్ర‌భుత్వానికి స‌రెండ‌ర్ చేయాల్సి ఉంటుంది. అలా కాని ప‌క్షంలో కొత్త త‌ల‌నొప్పులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. జాగ్ర‌త్త‌గా ఉండటం చాలా అవ‌స‌రం.