Begin typing your search above and press return to search.

జనసేనలో చిచ్చరపిడుగు...పవన్ మెచ్చిన నేతగా...

By:  Tupaki Desk   |   23 Nov 2022 2:30 AM GMT
జనసేనలో చిచ్చరపిడుగు...పవన్ మెచ్చిన నేతగా...
X
విశాఖలో జనసేనకు పట్టుంది. ఇపుడు ఆ పార్టీ గ్రాఫ్ కూడా బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా మంది నేతలు ఉత్సాహపడుతున్నారు. అయితే ఒక నేత మాత్రం మొత్తం విశాఖ జనసేనలోనే హైలెట్ గా నిలుస్తున్నారు. ఆయనే పీతల మూర్తి యాదవ్. ఆయన 2021 ఎన్నికల్లో కార్పొరేటర్ గా జనసేన తరఫున గెలిచారు. ఇక కార్పోరేషన్ లోపలా బయటా అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఆయన టీడీపీని మించి సైతం దూకుడు చేస్తున్నారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీకి కంట్లో నలుసుగా మారారు. దసపల్లా భూముల దందాను మొదట బయటకు తెచ్చింది పీతల మూర్తి అని చెప్పాలి. ఆ ఇష్యూలోనే వైసీపీ బాగా బదనాం అయింది. ఇరవై వేల మిగులు భూమిని 22 ఎస్ కేటగిరిలో చేర్చండి దాన్ని రక్షించండి అంటూ మూర్తి పెద్ద పోరాటం చేస్తూ వైసీపీకి పొగలూ సెగలూ తెప్పించేస్తున్నారు.

ఈ మధ్యనే ఏయూ వేదికగా ప్రధాని మోడీ, సీఎం జగన్ ల మీటింగ్ జరిగింది. ఈ సభ కోసం ఏకంగా ముప్పయి ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అతి పెద్ద చెట్లను కొట్టేశారు. దాంతో ఈ విషయం మీద హై కోర్టుకు వెళ్ళి ప్రభుత్వానికి తాఖీదులు ఇప్పించిన ఘనత మూర్తీ యాదవ్ దే.

అంతే కాదు రుషికొండ మీద పర్యావరణం దెబ్బతినేలా ప్రభుత్వం కట్టడాలు కడుతోంది అంటూ న్యాయం పోరాటంతో పాటు ప్రజా పోరాటాన్ని ఆయన చేస్తున్నారు. విశాఖలో వైసీపీకి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు ఎంపీలు అందరూ ఉన్నా జనసేన తరఫున చిచ్చరపుడిగులా మూర్తి యాదవ్ వీర విహారం చేస్తూంటే ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు అనే అంటున్నారు.

మరో వైపు చూస్తే మూర్తి యాదవ్ తూర్పు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఆయన గతంలో వైసీపీలోనే ఉండేవారు. అక్కడ ఆయనను సరిగ్గా ఉపయోగించుకోకుండా చేసి పంపేశారు. దాంతో ఆయన జనసేనలో చేరి వైసీపీని హడలెత్తిస్తున్నారు. పవన్ సైతం ఈ నేత పోరాటాలను మెచ్చుకున్నారు. ప్రత్యేకంగా అభినందించారు కూడా.

మరి వచ్చే ఎన్నికల్లో ఆయంకౌ టికెట్ దక్కుతుందా లేదా అన్నది చూడాలి. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం తూర్పు నుంచి మూర్తి యాదవ్ క్యాండిడేట్ అంటున్నారు. పొత్తులతో వస్తే టీడీపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యే వెలగపూడి ఉంటారు. ఏది ఎలా ఉన్నా జనసేనలో చాలా మంది నాయకులు ఉన్నా ఆ పార్టీ నుంచి జనంలో ఉంటూ గెలిచి ప్రజా పోరాటాలు గట్టిగా చేస్తున్న నోరున్న ఈ నేత అంతటి వైసీపీని ఏమీ కాకుండా చేస్తున్నారు అని అంటున్నారు.