Begin typing your search above and press return to search.

రాజన్నదొరకు రాజయోగం...?

By:  Tupaki Desk   |   9 April 2022 2:30 AM GMT
రాజన్నదొరకు రాజయోగం...?
X
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు టైమ్ దగ్గర పడుతున్న దగ్గర నుంచి చాలా పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే ఈ పేర్లు అన్నీ నిజమా అంటే చివరి నిముషంలో ఏమైనా మార్పులు లేకపోతే కన్ ఫర్మ్ అనే అంటున్నారు ఇక కొత్తగా ఉత్తరాంధ్రాలో ఏర్పాటు అయిన పార్వతీపురం మన్యం జిల్లా నుంచి తొలిసారి మంత్రిగా అయ్యే భాగ్యం పీడిక రాజన్నదొరకు దక్కుతోంది అంటున్నారు.

ఆయన సాలూరు నుంచి ఇప్పటికి నాలుగు సార్లు గెలిచారు. 2004లో ఆయన తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2009 నుంచి వరసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వైఎస్సార్ ఫ్యామిలీని ఆయన ఆప్తుడు. వైఎస్సార్ ఆయనకు తొలిసారి టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. అప్పట్లో టీడీపీకి కంచుకోటగా ఉన్న సాలూరుని ఆయన కాంగ్రెస్ వైపు ఆనక వైసీపీ వైపుగా తీసుకువచ్చారు.

ఇపుడు అక్కడ ఎదురులేకుండా వైసీపీ జెండా ఎగురుతోంది అంటే రాజన్నదొర కారణం అంటారు. ఇక మన్యం జిల్లా కొత్తగా ఏర్పాటు కావడంతో అనుభవం కలిగిన వారు మంత్రిగా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన కూడా హై కమాండ్ కి ఉంది. అదే టైమ్ లో విధేయతకు పెద్ద పీట వేయాలని చూస్తున్నారు. దాంతో రాజన్నదొరకు చాన్స్ దక్కింది అని తెలుస్తోంది.

ఆయనకు హై కమాండ్ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే మంత్రి పదవి కచ్చితంగా ఆయనకు దక్కుతుంది అని అంటున్నారు. విజయనగరం జిల్లాలో చూసుకుంటే బొత్స సత్యనారాయణతో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో ఆ ఈక్వేషన్స్ కూడా పనిచేస్తాయని చెబుతున్నారు.

మరో వైపు చూస్తే మన్యం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఇందులో పుష్ప శ్రీవాణి పదవి నుంచి దిగిపోతున్నారు. పార్వ‌తీపురం ఎమ్మెల్యే జోగారావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతికి ఇవ్వాలని ఉన్నా మహిళా కోటాలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి ఆ అవకాశం పోతోంది అంటున్నారు. మొత్తానికి ఇవన్నీ రాజన్నదొరకు కలసివచ్చాయని తెలుస్తోంది.

మొత్తానికి చూస్తే ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న మంత్రి పదవి రాజన్నదొరకు ఇపుడు దక్కుతోంది అని ఆయన వర్గం అంటోంది. ఈ నెల 11న రాజన్నదొర అమరావతికి వెళ్లి మంత్రిగా తిరిగి వస్తారని అంటున్నారు. మన్యం దొర రాజన్నే అని కూడా చెబుతున్నారు