Begin typing your search above and press return to search.

భారీ శపధం చేసేసిన మంత్రి పెద్దిరెడ్డి

By:  Tupaki Desk   |   14 Dec 2020 3:40 AM GMT
భారీ శపధం చేసేసిన మంత్రి పెద్దిరెడ్డి
X
ఇటీవల కాలంలో అనవసరమైన విషయాల్లో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. తనకే పాపం తెలీదని.. కుట్రపూరితంగా తనను బద్నాం చేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసే కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఇటీవల జడ్జి రామకృష్ణ ఎపిసోడ్ పై ఆయన క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అయినప్పటికీ తనపై టీడీపీ నేతలు అదే పనిగా విమర్శలు చేస్తుండటంతో విసిగిపోయిన పెద్దిరెడ్డి.. భారీ శపథమే చేశారు. సంచలనంగా మారిన ఆయన శపధంలోకి వెళితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంతజిల్లా అయిన చిత్తూరులో గెలిస్తే.. తాను రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటానని పెద్ద మాట చెప్పేశారు.

చంద్రబాబు దళిత వ్యతిరేకి అని.. ఆయనకు తానంటే భయం పట్టుకుందన్నారు. ఈ కారణంతోనే.. తన మీద కుట్ర చేస్తూ.. ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. అయినా.. రాజకీయాల్లో నాలుగు కాలాల పాటు ఉండాలని కోరుకోవాలే కానీ.. ఇలా అనవసరమైన శపధాలు చేయాల్సిన అవసరం ఉందా పెద్దిరెడ్డి?