Begin typing your search above and press return to search.
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారేమో ?
By: Tupaki Desk | 14 Oct 2020 7:15 AM GMTకొంతమంది అధికారులు తమ స్ధాయిని, పరిస్ధితులను కూడా మరచిపోయి వ్యవహరిస్తుంటారు. వాళ్ళకు ఏమనిపిస్తుందో తెలీదు కానీ చూసేవాళ్ళకు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లుగానే అనిపిస్తుంది. ఇటువంటి సంఘటన ఒకటి తాజాగా చిత్తూరు జిల్లాలోనే జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి ఆదివారం నాడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుట్టిన రోజు వచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలను జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ ఎత్తున నిర్వహించారు. పార్టీ పరంగా నేతలు, లేకపోతే మద్దతుదారులు మంత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం అత్యంత సహజం.
కానీ ఇదే వేడుకలను ఓ ఉన్నతాధికారి నిర్వహిస్తే ? ఇపుడిదే జరిగింది జిల్లాలో. మంత్రి పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో పెద్ద కేక్ ను ఇన్చార్జి సీఈవో ప్రభాకర్ రెడ్డి కట్ చేశారు. కార్యాలయంలో కట్ చేశారంటే పుట్టిన రోజు వేడుకలను అధికారికంగా చేసినట్లే లెక్క. పైగా మంత్రి శాఖ కూడా పంచాయితీరాజే కాబట్టి శాఖలోని ఉద్యోగులంతా కేక్ కటింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు.
మరి కేక్ కట్ చేసిన తర్వాత అంతమంది ఉద్యోగులు హాజరైన తర్వాత సీఈవో మాట్లాడకుండా ఎలా ఉంటారు. మంత్రి మద్దతుదారులు, ఉద్యోగులను చూసిన తర్వాత సీఈవో రెచ్చిపోయి పెద్దిరెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విషయం తెలిసిన మిగిలిన ఉద్యుగులు ఆశ్చర్యపోతున్నారు. మంత్రి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఓ ఉన్నతాధికారి అధికారికంగా నిర్వహించటం ఏమటంటూ విస్తుపోయారు. మంత్రిపై అభిమానం ఉంటే అది వ్యక్తిగతం. పైగా తన అభిమానాన్ని తెర వెనుకకు మాత్రమే పరిమితం చేయాల్సిన అధికారి బహిరంగంగా ప్రదర్శించటమంటే ...