Begin typing your search above and press return to search.
గోదావరి గోదాలోకి జగన్ కుడిభుజం...?
By: Tupaki Desk | 17 April 2022 8:29 AM GMTగోదావరి జిల్లాలు ఏపీలో అత్యంత కీలకమైనవి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జిల్లాలు ఏపీ మొత్తం జాతకాన్ని చెబుతారు. ఉమ్మడి గోదావరి జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇవి ఎటు వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే ఆ పార్టీ విజయతీరాలకు చేరుతుంది. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల చరిత్రను చూసుకుంటే ఆ విషయం స్పష్టం అవుతుంది.
ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలలో 2019 ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించిన వైసీపీకి ఈసారి కొంత ఇబ్బంది అవుతుంది అంటున్నారు. గతం కంటే జనసేన బాగా పుంజుకుంది. దాంతో పాటు టీడీపీతో పొత్తులు ఉంటాయని అంటున్నారు. అదే కనుక జరిగితే వైసీపీ గోదావరిలో ఎదురీత చేయకతప్పదు. దాంతో ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేసుకోవడం ద్వారా పొంచి ఉన్న పెను సవాల్ ని ఎదుర్కోవడానికి వైసీపీ పక్కాగా ప్రిపేర్ అవుతోంది.
ఈ నేపధ్యంలో జగన్ కుడిభుజం లాంటి రాజం పేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జిగా నియమించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు జిల్లాలూ రాజకీయంగా చాలా ముఖ్యం కాబట్టి తన సన్నిహితుడికే జగన్ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. గతంలో మాదిరిగానే ఎక్కువ సీట్లను ఇక్కడ గెలుచుకునే వ్యూహంలో భాగంగా ఈ తాజా నియామకం జరిగింది అని భావిస్తున్నారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నానికి మరో కీలకమైన రెండు జిల్లాలు క్రిష్ణా గుంటూరులను అప్పగిస్తారు అని తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో బలమైన ఒక సామాజికవర్గాన్ని దారిలో కి తెచ్చుకోవాలని వైసీపీ చూస్తోంది. ఆ బాధ్యతలను కొడాలి నాని అయితే కరెక్ట్ గా డీల్ చేస్తారని జగన్ భావిస్తున్నారుట.
ఇంకో వైపు ప్రకాశం, నెల్లూరు జిల్లా బాధ్యతలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చూస్తారు. ఆయన సీనియర్ మోస్ట్ నేత కావడమే కాదు, దక్షిణ కోస్తా రాజకీయాల మీద గట్టి పట్టు ఉండడంతో ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అలాగే కర్నూల్, అనంతపురం జిల్లాల బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి చూస్తారని చెబుతున్నారు. కడప, చిత్తూరు జిల్లాల బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తారు అని తెలుస్తోంది. మొత్తానికి వచ్చే ఎన్నికలకు వైసీపీ పూర్తిగా రెడీ అయినట్లే అంటున్నారు.