Begin typing your search above and press return to search.

ట్యాపింక్ కాదు ట్రాకింగ్ వాట్ ఎ ట్విస్ట్

By:  Tupaki Desk   |   12 May 2022 10:31 AM GMT
ట్యాపింక్ కాదు ట్రాకింగ్ వాట్ ఎ ట్విస్ట్
X
ప్ర‌స్తుతం మాజీ మంత్రి నారాయ‌ణ అరెస్టు చుట్టూనే ప‌రిణామాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. గ‌తం క‌న్నా భిన్నంగా ప‌రిణామాలు ఉన్నా కూడా కొన్ని సంద‌ర్భాల్లో అవి రాజకీయ ధోర‌ణ‌ల‌ను బాగానే ప్ర‌భావితం చేస్తున్నాయి. తాజాగా ఈ కేసులో పెద్దిరెడ్డి ఓ క్లారిటీ ఇచ్చారు.

తాము ఫ్లోన్ల‌ను ట్యాప్ చేయ‌లేద‌ని అది నేరం అన్న సంగ‌తి త‌మ‌కూ తెలుసు అని చెబుతూనే, అది ట్యాపింగ్ కాదు ట్రాకింగ్ అని చెప్పేరు. దీంతో మంత్రి ఇచ్చిన క్లారిటీపై మ‌ళ్లీ మ‌ళ్లీ మీడియా ముఖంగా టీడీపీ ఫైర్ అవుతుంది. అస‌లు ఏది ట్యాపింగ్ ఏది ట్రాకింగ్ అన్న‌ది తెలియ‌కుండానే మాట్లాడుతున్నారా అంటూ మండిప‌డుతున్నారు ప‌సుపు పార్టీ స‌భ్యులు.

ఇక మంత్రి ఇచ్చిన క్లారిటీ ఎలా ఉన్నా నారాయ‌ణ కేసులో మాత్రం జ‌గ‌న్ చూపిన అత్యుత్సాహం అంతా ఉస్సూరుమ‌నిపిస్తున్నారు మిగ‌తా మంత్రులు. వాళ్లు చెబుతున్న మాట‌ల్లో క్లారిటీ లేక‌పోవ‌డ‌మే కాకుండా కొంత అతి చేసి మాట్లాడ‌డం కూడా క‌నిపిస్తోంది.

గ‌తంలో ఇలాంటి ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ లు లేవా అని కూడా ప్ర‌శ్నిస్తోంది టీడీపీ. ఆ మాట‌కు వ‌స్తే జ‌గ‌న్ హయాంలో కానీ అంత‌కుముందు వైఎస్సార్ ఆస్తుల కేసులో కానీ చోటు చేసుకున్న వాటిని ఏమ‌నాలి ఆర్గ‌నైజ్డ్ క్రైం కిందే ప‌రిగ‌ణించాల‌ని అన్నారు కొంద‌రు టీడీపీ నాయ‌కులు.

ఆర్గ‌నైజ్డ్ క్రైం అంటే ఏంటి? అస‌లు ఈ కేసు కోర్టులో నిల‌దొక్కుకుంటుందో లేదో కూడా చూడాలి. వాస్త‌వానికి చాలా సంద‌ర్భాల్లో ఈ ప‌దం వాడుతున్నా వాటి వెనుక ఉన్న అర్థం ఏంటి అన్న‌ది ముఖ్యంగా ఎవ‌రికి వారు తెలుసుకోవాలి.

ఆ రోజు అక్ర‌మాస్తుల కేసు కూడా ఓ విధంగా ఆర్గ‌నైజ్డ్ క్రైంకు చెందిందేన‌ని ఎందుకు టీడీపీ అంటుంది అంటే అవ‌న్నీ ముంద‌స్తు ప్ర‌ణాళిక, అంచ‌నా ప్ర‌కారం జ‌రిగిన‌వే అని కొంద‌రు ప‌రిశీల‌కులు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. పేప‌ర్ లీక్ అన్న‌ది ఆర్థిక నేరం కింద‌నే ప‌రిగ‌ణిస్తే అదే స్థాయిలో ఆ రోజు జ‌రిగిన నేరాల‌న్నీ ఆర్థిక సంబంధింతాలే క‌నుక వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు అన్నీ కోర్టు కానీ ద‌ర్యాప్తు సంస్థ‌లు కానీ ఈ పాటికే గుర్తించాయి క‌నుక ఎవరు ఎవ‌రిని ఆర్గ‌నైజ్ చేస్తున్నారో అన్న‌ది తెలుసుకోవాల‌ని టీడీపీ హితవు చెబుతోంది.