Begin typing your search above and press return to search.

జియోలో వాటా కొనుగోలు చేసినా విస్టాక్ ఈక్విటీ !

By:  Tupaki Desk   |   8 May 2020 7:16 AM GMT
జియోలో వాటా కొనుగోలు చేసినా విస్టాక్ ఈక్విటీ   !
X
ఈ మద్యే టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియోలో ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా దిగ్గజ సంస్థ అయిన ఫేస్ ‌బుక్ భారీ పెట్టుబ‌డి పెట్టిన సంగ‌తి తెలిసిందే. జియోలో 9.99 శాతం వాటాను ఫేస్‌ బుక్ రూ.44వేల కోట్ల‌కు కొనుగోలు చేసింది. దీంతో వాట్సాప్ ద్వారా త‌న జియో మార్ట్ సేవ‌ల‌ను ప్రారంభించింది. ఇక ఆ డీల్ పూర్త‌యి కొద్ది రోజులు కూడా గ‌డవ‌క‌ముందే మ‌రో అమెరికా సంస్థ జియోలో భారీగా పెట్టుబ‌డులు పెట్టింది. తాజాగా అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ విస్తా ఈక్విటీ కూడా పెద్ద మొత్తంలో జియ్ ప్లాట్‌ ఫాం లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

జియో ప్లాట్‌ ఫామ్స్ ‌లో విస్తా ఈక్విటీ రూ.11,367 కోట్ల విలువైన 2.3 శాతం వాటాను దక్కించుకునేందుకు ఇన్వెస్ట్ చేయనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోకస్డ్ ఫండ్ కంపెనీ. ఈ మేరకు గత వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలి కాలంలో రిలయన్స్‌కు ఇది మూడో అతిపెద్ద ఒప్పందం. జియో ప్లాట్‌ ఫామ్స్ ఈక్విటీ వ్యాల్యూ రూ.4.91 లక్షల కోట్ల వద్ద ఇన్వెస్ట్ చేసింది. ఎంటర్ ‌ప్రైజ్ వ్యాల్యూ రూ.5.16 లక్షల కోట్లు.

గత పదేళ్లలో ఈ ఈక్విటీ సంస్థ పెట్టుబడులు పెట్టిన కంపెనీలు చాలా వరకు లాభాల్లో ఉన్నాయి. మన దేశంలో విస్తా ఈక్విటీ పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. ఈ పెట్టుబడి ద్వారా జియో నిర్వహణ నాణ్యతపై వ్యాపార వర్గాల్లో నమ్మకం పెరుగుతుంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ తర్వాత ఫేస్‌బుక్, ఆ తర్వాత అతిపెద్ద పెట్టుబడి విస్తా ఈక్విటీది. మొదట జియో-ఫేస్‌బుక్ మధ్య రూ.43,574 కోట్ల డీల్ కుదిరింది. ఈ పెట్టుబడితో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత అమెరికా ప్రయివేటు ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్.. జియో ప్లాట్‌ ఫామ్స్ ‌లో 1 శాతం వాటాను రూ.5,655 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ తో వరల్డ్ లోనే అత్యంత శక్తిమంతమైన టెక్నాలజీ ఎంటర్ ప్రైజస్ సంస్థగా రిలయన్స్ జియోకు గుర్తింపు వచ్చిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.