Begin typing your search above and press return to search.

కాశ్మీర్‌ రాజకీయానికి శుభంకార్డు పడుతున్నట్టేనా?!

By:  Tupaki Desk   |   20 Jan 2015 5:18 AM GMT
కాశ్మీర్‌ రాజకీయానికి శుభంకార్డు పడుతున్నట్టేనా?!
X
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మీద ఎన్నో ఆశలు పెట్టుకొన్న పీడీపీకి ఇకమరో మార్గం లేదు. జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించిన పార్టీగా నిలిచిన పీడీపీ ఈ విజయాన్ని ఇప్పటి వరకూ సెలబ్రేట్‌ చేసుకొన్నది లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండి కూడా సరైన మిత్రపక్షం దొరకడం లేదు.

మరో కాశ్మీరీ ప్రాంతీయ పార్టీ ఎన్సీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించిన పీడీపీ చివరకు ఆ పార్టీకి దూరం అయ్యింది. దాంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమనే అభిప్రాయానికి వచ్చేసింది.

ఇప్పుడు పీడీపీకి మిగిలిన ఆప్షన్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీలు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కలిసి అడుగేయడానికి ఎవరికీ ధైర్యం లేదు. దీంతో పీడీపీ భారతీయ జనతా పార్టీ వైపే చూస్తోంది.

28 ఎమ్మెల్యేల బలంతో ఉన్న పీడీపీ, 25 మందిఎమ్మెల్యేలను కలిగిన భారతీయ జనతాపార్టీలు కలిస్తే పటిష్టమైన ప్రభుత్వమే ఏర్పడుతుంది. అయితే పాలన కాలాన్ని పంచుకోవడం, పదవులను పంచుకోవడమే కొంచెం కష్టం.

ఈ నేపథ్యంలో పీడీపీ అధినేత ముఫ్తీమహమ్మద్‌ సయీద్‌ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. కాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించడానికే ఆయన ప్రధానితో సమావేశం అయ్యారట.

స్థూలంగా జమ్మూకాశ్మీర్‌లో ఏర్పడిన రాజకీయపరిస్థితులను బట్టి... పీడీపీ, బీజేపీలో చేతులు కలపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక వారి ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమేనేమో!