Begin typing your search above and press return to search.

రేవంత్ కు పీసీసీ: అసంతృప్తులపై రంగంలోకి అధిష్టానం

By:  Tupaki Desk   |   27 Jun 2021 4:30 PM GMT
రేవంత్ కు పీసీసీ: అసంతృప్తులపై రంగంలోకి అధిష్టానం
X
రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా చేయడంపై కాంగ్రెస్ సీనియర్లు గుంభనంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన పోటీదారు, ఎంపీ అయిన కోమటిరెడ్డి ఇక తాను గాంధీ భవన్ మెట్లు తొక్కనని శపథం చేశాడు. ఈ క్రమంలోనే చెలరేగిన అసంతృప్తిని చల్లార్చే పనిని కాగ్రెస్ అధిష్టానం చేపట్టింది.

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి సహకరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. అసంతృప్తులతో మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చాడు. రేవంత్ రెడ్డితో షబ్బీర్ అలీ భేటి అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా సిపాయిలుగా పనిచేయాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని యువత బలంగా కోరుకుంటోందని.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని షబ్బీర్ అలీ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల సీఎంలు కుమ్మక్కై జలజగడం సృష్టిస్తున్నారని షబ్బీర్అ లీ ఆరోపించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో రేవంత్ రెడ్డి మాట్లాడుతారని అలీ చెప్పారు.

నిన్న టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డిని నియమించవద్దని కాంగ్రెస్ సీనియర్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై అసంతృప్తి జ్వాల తాజాగా బయటపడుతోంది.