ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్షానికి ఇచ్చే ఏపీ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవికి అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎంపికయ్యారు. ఈమేరకు ప్రతిపక్ష నే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ పదవికి కుల సమీకరణాలు పాటించాలని చంద్రబాబు ముందు అనుకున్నా.... ఇప్పటికే డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఇతర కులాలకు కేటాయించడం, పీఏసీకి అవగాహన ఉన్న నేత కోసం చూడటంతో పయ్యావులకు ఆ పదవి దక్కిందంటున్నారు. పైగా చంద్రబాబు కుటుంబం కాకుండా రాయలసీమలో జగన్ గాలిలో నిలబడిన ఏకైక నేత పయ్యావుల కేశవ్. అయితే, టీడీపీ గెలిచినపుడు ఎన్నడూ ఆయన గెలవకపోవడం వల్ల మంత్రి పదవులు కోల్పోతూ వస్తున్న నేపథ్యంలో పయ్యావుల కేశవ్ కు ఈ పదవి ఇవ్వాలన్న వాదన కూడా ఉంది.
ఇది లా ఉండగా మరో వైపు కీలక మంత్రి పదవుల్లో జగన్ రెడ్డి కులం కుంటే ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు పీఏసీ పదవిని ఇతర కులానికి కేటాయిస్తారని అందరూ ఊహించినా అది జరగలేదు. రెండు రోజుల మదనం అనంతరం సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు ఆ పదవి కట్టబెట్టారు.
కేశవ్ నియామకం గురించి చంద్రబాబు స్పీకర్‌కు సమాచారం అందించారు. పైగా పయ్యావుల కేశవ్ తెలుగుదేశంలో వాగ్దాటి కలిగిన నేతల్లో ఒకరు కూడా కూడా ఈ పదవి దక్కడానికి ఆయనకు అనుకూలించింది.