Begin typing your search above and press return to search.
‘వారు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చారు’.. షాకింగ్ బాంబ్ పేల్చిన పయ్యావుల
By: Tupaki Desk | 17 Nov 2021 4:28 AM GMTఏపీ రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారే అంశాన్ని వెల్లడించారు. తనకు అందిన విశ్వసనీయ సమాచారాన్ని.. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే తాను మాట్లాడుతున్నట్లుగా చెప్పిన ఆయన చేసిన ప్రకటన ప్రకంపనల్ని క్రియేట్ చేస్తోంది. మంగళవారం రాత్రి వేళ హటాత్తుగా మీడియా ప్రతినిధుల్ని పిలిచిన ఆయన తీరు ఆశ్చర్యకరంగా మారింది.
ముఖ్యమైన విషయాన్ని వెల్లడించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి వచ్చిందన్న ఆయన.. ఢిల్లీ నుంచి ఒక ప్రతినిధుల బృందం విజయవాడకు వస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నరు.
ఇంతకీ దేశ రాజధాని ఢిల్లీ నుంచి విజయవాడకు వస్తున్న ప్రత్యేక బృందం ఎవరన్న విషయాన్ని ఆయన చెబుతూ.. వారెందుకు వస్తున్నారో చెప్పిన సంచలనంగా మారారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న పయ్యావుల 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఫైర్ బ్రాండ్ నేత అవసరమైనంతగా రియాక్టు కావట్లేదని.. ఆచితూచి అన్నట్లుగా.. తక్కువగానే స్పందిస్తున్నట్లుగా విమర్శలు ఉన్నాయి.
ఇంతకీ ఆయన పేల్చిన బాంబేమిటంటే.. ఢిల్లీ నుంచి ఏపీకి అప్పుల్ని రికవరీ చేసేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు చెందిన అధికారులతో పాటు రూరల్ కార్పొరేషన్ కు సంబంధించిన ఎలక్ట్రికల్ అధికారులు వస్తున్నారన్నారు. తనకు అందిన సమాచారం కీలక వర్గాల నుంచి అందినట్లుగా చెప్పారు. ఈ రెండు టీంలు ఏపీకి రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందని.. అనేక స్థాయిల్లో ఒత్తిళ్లను తీసుకొచ్చారన్నారు.
అయిపప్పటికీ అధికారులు తమ విధి నిర్వహణను పక్కాగా నిర్వహించేందుకు విజయవాడకు వస్తున్నట్లు చెప్పారు. పెద్ద ఎత్తున పేరుకుపోయిన బకాయిల్ని చెల్లించకుండా ఉంటున్న ఏపీ ప్రభుత్వ తీరుతో విద్యుత్ సంస్థల్ని నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్స్ కిందకు వచ్చేస్తాయని.. ఈ అంశాన్ని తాను ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి చేజారిపోయిందని.. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా పాలన సాగుతుందని వ్యాఖ్యానించారు.
మొత్తంగా ఏపీ అధికారపక్షంలో కఠినమైన సవాల్ ను ఎదుర్కొనే పరిస్థితి తాజాగా నెలకొందని చెప్పాలి. ఢిల్లీ నుంచి వస్తున్న ఈ అధికారులు.. అప్పుల రికవరీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? దీనికి ఏపీ ప్రభుత్వం ఏ రీతిలో స్పందిస్తుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ ఇబ్బందికర పరిస్థితిని జగన్ సర్కారు డీల్ చేయటంలో ముఖ్యమంత్రి సామర్థ్యం ఏమిటన్నది తేలుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.