Begin typing your search above and press return to search.

అనపర్తి వద్దే ఆగిన పవన్...మ్యాటరేంటో...?

By:  Tupaki Desk   |   26 Feb 2023 9:28 AM GMT
అనపర్తి వద్దే ఆగిన పవన్...మ్యాటరేంటో...?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా జనం మధ్యన లేకపోయినా ఆయన అనుక్షణం ఏపీ రాజకీయాలను ఫాలో అవుతారు. ప్రభుత్వ వైఫల్యం ఎక్కడ ఉన్నా చెడా మడా కడిగిపారేస్తారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఘాటైన విమర్శలు చేస్తారు. అలా పవన్ నిరంతరం అన్నట్లుగానే అలెర్ట్ గా ఉంటారు. ఈ మధ్యనే టీడీపీ అధినేత చంద్రబాబు అనపర్తి సభ విషయంలో అనుమతిని చివరి నిముషంలో నిరాకరిస్తూ పోలీసులు చేసిన అతి మీద పవన్ మండిపడ్డారు.

తన ట్విట్టర్ ద్వారా ఆయన ఫైర్ అయ్యారు. ప్రాధమిక స్వేచ్చ హక్కులు అంటే అర్ధం తెలుసా అని అధికార పార్టీ మీద నిప్పులే చెరిగారు. చంద్రబాబుకు అండగా నిలిచారు. ఇక ఆ తరువాత గన్నవరంలో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీదనే వైసీపీ వారు దాడి చేశారు. వారూ వీరూ ఘర్షణ పడితే తెలుగుదేశానికి భారీ నష్టం వాటిల్లింది. అయితే పోలీసులు టీడీపీ నేత పట్టాభి మీద మరో పద్నాలుగు మంది మీద కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు

ఇదిలా ఉంటే ఇంతలా అతలాకుతలం చేస్తూ ఏపీలో అధికార వైసీపీ తెలుగుదేశం పార్టీల మధ్యన రావణ కాష్టంగా మారిన గన్నవరం విషయంలో పవన్ నుంచి ఒక్క ట్వీట్ కూడా రాలేదు. మరి మ్యాటరేంటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది. నిజానికి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద కలసి పోరాడాలని సంఘీభావం తెలియచేసుకోవాలని పవన్ బాబు అనుకున్నారు. అందుకే విశాఖలో పవన్ని అడ్డుకుని పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసన తెలియచేస్తూ విజయవాడలో పవన్ బస చేసిన హొటల్ కి వెళ్ళి మరీ బాబు సంఘీభావం తెలిపారు.

ఆ మీదట కుప్పంలో చంద్రబాబు ప్రచార రధాన్ని పోలీసులు తీసుకుని ఇబ్బంది పెడితే పవన్ ఏకంగా బాబు ఉన్న హైదరాబాద్ ఇంటికి వచ్చి మరీ కలసి ప్రభుత్వ తీరుని ఎండగట్టారు అనపర్తి ఎపిసోడ్ దాకా ఈ మద్దతు కొనసాగింది. ఆ మీదట మాత్రం పవన్ ట్విట్టర్ నుంచి ఏమీ మెసేజ్ రాలేదు. అసలు ఎందుకిలా అంటే ఇక్కడే ఉంది మ్యాటర్ అంటున్నారు. ఈ మధ్యలో ఒక కధనం తెలుగుదేశం అనుకూల పత్రికలో వచ్చింది.

వీకెండ్ కాలం రాసే ఆ పత్రికాధిపతి పవన్ విషయంలో ఏవో తనకు ఉన్న సమాచారం మేరకో లేక ఊహాగానాలను ఏర్చి కూర్చారో తెలియదు కానీ కాలం మొత్తం రాసేశారు. అందులో పవన్ కళ్యాణ్ జనసేన ఏపీలో బీయారెస్ తో కలసి నడబోతోందని, దానికి వేయి కోట్ల డీల్ అంటూ ఆ కాలం లో రాసుకొచ్చారు. చిత్రమేంటి అంటే దాని మీద అటు బీయరెస్ నేతలు కానీ ఇటు జనసేన నుంచి కానీ స్ట్రాంగ్ కౌంటర్ అయితే పెద్దగా రాలేదు. మరి ఏం జరిగిందో ఏమో ఎవరికీ తెలియదు.

అయితే ఈ కాలం వెనక తెలుగుదేశం పెద్దలు ఉన్నారని సోషల్ మీడియాలో జనసేన నుంచి పోస్టింగులు అయితే పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. అటు వైపు టెలుగుదేశం సోషల్ మీడియా వింగ్ నుంచి కూడా రివర్స్ లో కౌంటర్స్ వచ్చాయి. అలా వార్ అయితే సాగుతోంది కానీ అగ్ర నేతల స్థాయిలో కానీ లేక కీలక నేతల వైపు నుంచి కానీ సరైన వివరణ అయితే లేదు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జనసేనకు అనుకూలంగా ఉంటే వెబ్ సైట్స్ సోషల్ మీడియా ఆక్టివిస్టుల నుంచి కొన్ని సూచనలు వస్తున్నాయి.

జనసేన సొంతంగా పోటీ చేయాలని ఏ పార్టీకి కొమ్ము కాయవద్దని, ఎవరినీ అసలు నమ్మవద్దని, ఏపీలో పొత్తులే వద్దు అని కూడా సూచనలు చేస్తున్నారు. మరి దీని మీద జనసేన ఏ రకంగా రియాక్ట్ అవుతుందో తెలియదు కానీ పవన్ మాత్రం గన్నవరం గరం గరం రాజకీయం విషయంలో పెద్దగా రియాక్ట్ కాకపోవడాన్ని చూసిన వారు సం థింగ్ సం థింగ్ అంటున్నారుట. మరి ఈ గుసగుసలు రాజకీయ గసగసాలు ఊరు దాటి వాడ దాటేలోగా ఏదైనా అసలు సిసలు మ్యాటర్ తెలుస్తుందా అన్నదే అంతా వెయింటంగట.