Begin typing your search above and press return to search.

విశాఖ‌లో ప‌వ‌న్ టూర్‌.. వైసీపీలో గ‌డ‌బిడ‌..!

By:  Tupaki Desk   |   30 Oct 2022 7:18 AM GMT
విశాఖ‌లో ప‌వ‌న్ టూర్‌.. వైసీపీలో గ‌డ‌బిడ‌..!
X
వ‌చ్చే నెల 3న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించ‌నున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మొద‌ల‌య్యాయి. విశాఖ‌లో భారీ ఎత్తున ఆయ‌న మార్చ్ నిర్వ‌హించ‌నున్నారు. విశాఖ‌లోని బీచ్ రోడ్‌లో ఈ మార్చ్ సాగ‌నుంది. అయితే, దీనికి సంబంధించి ప‌వ‌న్ ప్లాన్ ఏంటి? అస లు అనూహ్యంగా ఈ మార్చ్ ఎలా తెర‌మీదికి వ‌చ్చింది? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులు అని క‌ల‌వ‌రిస్తోంది. అయితే.. అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఉంచి.. విశాఖ‌ను అభివృద్ధి చేయాల‌ని టీడీపీ చెబుతోంది.

ఈనేప‌థ్యంలో త‌లెత్తిన వివాదం.. చివ‌ర‌కు అనేక మ‌లుపులు తిరుగుతోంది. ప‌రోక్షంగా ప్ర‌త్య‌క్షంగా ప‌వ‌న్ కూడా అమ‌రావ‌తికే మ‌ద్ద‌తిస్తున్నారు. అయి తే విశాఖ‌ను అభివృద్ధి చేయొద్ద‌ని మాత్రం అన‌డం లేదు. అందుకే.. ఇరు ప‌క్షాల మ‌ద్య తీవ్ర‌స్థాయిలో యుద్ధం జ‌రుగుతోంది. ఇక, ఈ క్ర‌మంలోనే ఇటీ వ‌ల మంత్రులు విశాఖ గ‌ర్జ‌న పేరుతో కార్య‌క్ర‌మానికి పిలుపునిస్తే.. వెంట‌నే జ‌న‌సేన అక్క‌డ జ‌న‌వాణి కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. అయితే ఇది వివాదానికి దారి తీయ‌డం.. మాట‌ల తూటాలు పేల‌డం తెలిసిందే. అప్ప‌టి నుంచి రాజ‌కీయాలు గుంభ‌నంగానే సాగుతున్నాయి.

మ‌రోవైపు తాజాగా న‌వంబ‌రు 3న ప‌వ‌న్ విశాఖ‌లో మార్చ్ నిర్వ‌హించ‌నున్నాడ‌నే వార్త ఆస‌క్తి రేపుతోంది. అయితే, ఆయ‌న కాన్సెప్టు అంతా.. కూడా.. విశాఖ‌ను దోచుకునేందుకే వైసీపీ నాయ‌కులు ఇక్క‌డ రాజ‌ధాని ఏర్పాటు చేస్తున్నార‌ని ప్ర‌క‌టించ‌డం అనే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. సుమారు 5 కిలోమీట‌ర్ల మేర‌కు సాగే ఈ పాద‌యాత్ర‌లో యువ‌త‌, విద్యార్థుల‌ను కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. స‌హ‌జంగానే సినీ గ్లామ‌ర్ ఎక్కువ‌గా ఉన్నందు న వారు త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, దీనికి విరుగుడుగా వైసీపీ మంత్రులు కూడా రెడీ అవుతున్నారు.

తాము కూడా.. విశాఖ‌లో మంత్రుల పాద‌యాత్ర చేస్తామని నాయ‌కులు సిద్ధం అవుతున్నారు. దీంతో రాజ‌కీయంగా ఒక్క‌సారిగా మ‌ళ్లీ వేడెక్కింది. ఈ విష‌యంలో జ‌గ‌న్ నిర్ణ‌యం ఎలా ఉంటుందోచూసి.. దాని ప్ర‌కారం తాము కూడా ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు మంత్రులు చెబుతున్నారు. విశాఖ స‌హా ఉత్త‌రాంధ్ర‌కు చెందిన నాయ‌కులు.. క‌లిసి.. పాద‌యాత్ర నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా న‌వంబ‌రు 3నే చేస్తార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.