Begin typing your search above and press return to search.
పోటీ చేసి ఓడిన చోటనే రీ సౌండ్... ?
By: Tupaki Desk | 25 Oct 2021 11:30 PM GMTరాజకీయాల్లో గొప్పతనం ఏంటి అంటే గెలుపు ఓటములు అన్నవి జస్ట్ లెక్కలే. ఓడినా జనాల్లో ఉండొచ్చు. ఓడితేనే ఇంకా పెద్ద సౌండ్ చేయవచ్చు. గెలిచిన వారికి బాధ్యతలు ఉంటాయి. ఇచ్చిన హామీలు తీర్చే పనిలో తలమునకలు కావాల్సి ఉంటుంది. అదే ఓడిన వారు విపక్ష పాత్రలోకి చాలా ఈజీగా వచ్చేస్తారు. ఇంతకీ జనాలకు ఏం చేశారంటూ గర్జించే బ్రహ్మాండమైన చాన్స్ ఉంటుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇపుడు ఆ చాన్స్ ని బాగా వాడుకుంటున్నారు. ఆయన తీరిక దొరికితే చాలు ఏపీకి వస్తున్నారు. ఆయన రాక పోకల మధ్యన జరిగే రాజకీయాలూ, మాటల యుద్ధాలు అన్నీ ఇన్నీ కావు. అక్టోబర్ 2న గాంధీ జయంతి వేళ రాజమండ్రిలో పవన్ పెట్టిన పోలికేక కొన్ని రోజుల పాటు అధికార పార్టీని ఇరుకున పెట్టి తెగ ఇక్కట్లు పెట్టింది.
ఇపుడు మరో మారు పవన్ టూర్ వేశారు. ఈసారి ఆయన ఉత్తరాంధ్రాలో పర్యటించనున్నారు. ఈ నెల 31 నుంచి నవంబర్ 2 వరకూ అంటే మూడు రోజుల పాటు పవన్ ఉత్తరాంధ్రా పర్యటన ఏపీలో సరికొత్త రాజకీయ ప్రకంపలనకు సృష్టించే అవకాశం ఉంది. ఇక పవన్ ఈ నెల 31న విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్యమం చేస్తున్న ఉక్కు కార్మికులకు మద్దతు ప్రకటిస్తారు. గత 250 రోజులుగా కార్మికులు ఆందోళనాపధంలో ఉన్నారు. కేంద్రం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్న నేపధ్యంలో కార్మిక లోకం అంతా ఒక్కటిగా ఆందోళన చేపడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లోకేట్ అయి ఉన్నది పక్కాగా గాజువాక నియోజకవర్గంలో. అంటే 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన సీటు అన్న మాట. నాడు పవన్ ఓడినా ఇపుడు మాత్రం ఆయన అక్కడ నుంచే రీ సౌండ్ చేయబోతున్నారు. అంతే కాదు, విశాఖ ఉక్కు ప్రైవేట్ అవుతూంటే ఏపీ సర్కార్ ఏం చేస్తోంది, గాజువాక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అని గర్జించే అవకాశం అయితే గట్టిగా ఉంది. ఇక పవన్ బహిరంగ సభ మంట పుట్టించేలా సాగుతుంది అంటున్నారు.
అదే విధంగా పవన్ ఉత్తరాంధ్రా మత్య్సకారుల సమస్యల మీద మరో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రా జిల్లాల తీర ప్రాంతాలలో పర్యటిస్తారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. డీజిల్ ధర పెద్ద ఎత్తున పెరగడంతో మత్య్సకారులు మర పడవలు నడపలేక నానా అవస్థలు పడుతున్న సంగతి విధితమే. అందువల్ల వారికి ఇచ్చే డీజిల్ సబ్సిడీని తొమ్మిది రూపాయల నుంచి ఇరవై రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దాని మీద పవన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగానే కోరుతారు అంటున్నారు. అదే విధంగా వైసీపీ సర్కార్ తీసుకువచ్చిన వివాదాస్పద జీవో 217ని ని రద్దు చేయాలని మత్య్సకారులు కోరుతున్నారు. దీని వల్ల తమ జీవనోపాధి దారుణంగా దెబ్బ తింటోందని కూడా చెబుతున్నారు. పవన్ ఈ అంశాలతో పాటు మత్స్యకార ప్రాంతాలను సందర్శించి మరిన్ని రాజకీయ అంశాల మీద కూడా మాట్లాడుతారు అని జనసేన నాయకులు అంటున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రాకు చాలా కాలానికి వస్తున్న పవన్ టూర్ మీద అన్ని రాజకీయ పార్టీల కళ్ళూ ఉన్నాయి. అధికార పార్టీ అయితే ఆయన ఏ బాంబులు పేలుస్తారో అన్న ఉత్కంఠతో ఉంది.