Begin typing your search above and press return to search.
పవన్ పోటీ చేసేది ఎక్కడనుంచి... హింట్ వచ్చిందా?
By: Tupaki Desk | 18 Jun 2023 6:00 PM GMTప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా స్థానిక నేతలతో రాబోయే ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యే అవ్వకుండా ఎవడాపుతాడో చూస్తానంటున్న పవన్... ఈ సారి ఎక్కడినుంచి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.
గతంలో భీమవరం, గాజువాక స్థానాలనుంచి పోటీ చేసిన పవన్.. రెండు చోట్లా ఓటమిపాలీన్ సంగతి తెలిసిందే. అయితే గెలుపు అనివార్యం అయిన నేపథ్యంలో... ఈసారి ఎక్కడనుంచి పోటీచేస్తారనేదానిపై తెగ చర్చలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా... ఇక భీమవరం, గాజువాకల సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రముఖంగా రెండు నియోజకవర్గాల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
వాటిలో ఒకటి రాయలసీమ ప్రాంతానికి చెందిన తిరుపతి నియోజకవర్గం కాగా... మరొకటి ప్రస్తుతం పవన్ వారాహి యాత్ర సాగుతున్న తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం అని కథనాలొస్తున్నాయి.
అవును... వారాహి యాత్రలో దూకుడుమీదున్న పవన్.. ఈసారి కచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానుంచే పోటీచేస్తారని స్థానికంగా చర్చ నడుస్తుంది. ఇదే క్రమలో... వారాహి యాత్రలో భాగంగా పవన్ రెండురోజులు పాటు పిఠాపురంలోనే ఉండటం, స్థానిక నేతలతో సుదీర్ఘ చర్చలు జరపడంతో ఈ ఊహాగాణాలకు మరింత బలం చేకూరుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా... పుఠాపురంలోనే జనసేన పార్టీ ఆఫీసు ఓపెన్ చేస్తానని, స్థానికంగా ఇల్లు కూడా కట్టుకోబోతున్నట్లుగా పవన్ చెప్పడంతో ఈ వాదనకు మరింత బలం తోడయ్యింది. పైగా పక్కనే ఉన్న కానినాడ, రాజమండ్రిల్లో పార్టీ ఆఫీసులు ఉండగా.. మధ్యలో మళ్లీ పిఠాపురంలో కూడా ఆఫీసు ఓపెన్ చేయడం, ఇంటి టాపిక్ కూడా ఎత్తడంతో ఆల్ మోస్ట్ కన్ ఫాం అంటూ ఫిక్సయిపోతున్నారు పిఠాపురంలోని మెజారిటీ జనసైనికులు!
ఇక పిఠాపురం నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి 2,29,591 మంది ఓటర్లు ఉండగా... అది ఇప్పుడు 2.5 లక్షలకు చేరి ఉంటుందని అంచనా! వీటిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాదాపు 75 వేలదాకా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మిగిలిన సామాజిక వర్గ ఓట్లలో బీసీలు, ఎస్సీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు!
ఈ కారణంతోనే... పోటీచేసే వాళ్ళు మనవాళ్ళా కాదా అని కులం కోణంలో కాకుండా మంచిచేస్తారా చెయ్యరా అనే కోణంలో చూసి ఓట్లు వేయండని చెబుతున్నారని గుర్తుచేస్తున్నారు పరిశీలకులు. దీంతో... పిఠాపురాన్ని ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు నెటిజన్లు!
కాగా, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు కి 83, 459 (44.71%) ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మకి 68, 470 (36.68%) ఓట్లు వచ్చాయి. ఇక మూడోస్థానంలో నిలిచిన జనసేన అభ్యర్థి మాకినీడి శేషుకుమారి కి 28,011 (15%) ఓట్లు వచ్చాయి.