Begin typing your search above and press return to search.
పవన్‌కు ఇక్కడ కన్నా.. ఢిల్లీలోనే బెటర్..!
By: Tupaki Desk | 30 Oct 2021 3:30 AM GMTవిశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే అనేక రూపాల్లో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయితే.. అన్ని పార్టీలూ కూడా ఇలా వద్దని చెబుతున్నాయి. ముఖ్యం గా అధికార పార్టీ వైసీపీ.. కేంద్రంలోని మోడీ సర్కారుకు.. లేఖలు కూడా రాసింది. ఇక, విపక్ష నాయకుడు.. చంద్రబాబు సైతం తనదైన పంథాలో.. కేంద్రానికి వినతలు సమర్పిస్తున్నారు. అయితే.. ఇప్పుడు.. ఇన్నా ళ్ల కు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముందుకు కదిలారు. ఇప్పటికైనా.. కీలకమైన సమస్యపై పవన్ స్పందించడం జనసేనకు ఎంతో కొంత ప్లస్ అవుతోంది.
ఈ క్రమంలో పవన్ విశాఖలో పర్యటించి.. ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం వినిపిస్తున్న ఉద్యోగుల తో ఆయన భేటీ అయి.. వారి ఉద్యమానికి మద్దతు ప్రకటించనున్నారు. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇక్కడకు రావడాన్ని వారు స్వాగతిస్తున్నారు. తమకు మంచి జరుగుతుందని వారు అనుకుంటున్నారు. అయితే.. పవన్ స్పందించకపోతే.. స్పందించలేదని.. అన్న వారే.. ఇప్పుడు డిఫరెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అదేంటంటే.. పవన్ ఇక్కడ విశాఖకు వచ్చి చేసేదేంటి ? అని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి కూడా ఒక రీజన్ చెబుతున్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించొద్దని.. ఉద్యమం జరుగుతూనే ఉంది. కానీ. కేంద్రం పెద్దల వద్ద కూర్చొని.. ఈ సమస్యపై చర్చించే నాయకులు కరువయ్యారనేది ఇక్కడి ప్రజలు ఆవేదన. కేవలం లెటర్లు రాసి.. వదిలేస్తున్నారని. అలా కాకుండా.. పవన్ కు ఎలాగూ.. బీజేపీతో యాక్సస్ ఉంది కనుక బీజేపీ పెద్దలతో వ్యూహాత్మకంగా మిత్రత్వం నెరుపుతున్నారు కనుక.. విశాఖ సమస్యను ఇతర పార్టీల మాదిరిగా కాకుండా.. నేరుగా బీజేపీ పెద్దలతోనే పవన్ చర్చించేందుకు అవకాశం ఉందని.. సో.. ఆదిశగా.. కేంద్రంలో నే అంటే.. ఢిల్లీలోనే పవన్ దీనిపై పోరాడితే.. ప్రజలు నమ్ముతారని.. ఫలితంగా పవన్‌కు ఇమేజ్ పెరుగుతుందని చెబుతున్నారు.
వాస్తవానికి.. ప్రజలు కోరుకుంటున్నట్టు పవన్ కనుక వ్యవహరిస్తే.. ఆయనకు నైతికంగా మద్దతు పెరగడం తోపాటు.. పార్టీకి రాజకీయంగా కూడా మద్దతు పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పటి వరకు పవన్ కారణంగా. రాష్ట్రానికి జరిగిన మేలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ప్రత్యేక హోదా నుంచి అనేక సమస్యలపై ప్రస్తావించడం.. జారవిడవడం.. చేస్తున్నారనే విమర్శలు వున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు.. వచ్చిన అవకాశాన్ని కేవలం రాజకీయంగా కాకుండా.. నిబద్ధతతో తీసుకుని.. ఢిల్లీలో కూర్చుంటే.. పరిష్కారం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.