Begin typing your search above and press return to search.
జనసేన టీడీపీకి బీ టీమ్... పవన్ కీలక వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 13 July 2023 5:59 PM GMTజనసేన అనేది టీడీపీకి బీ టీమ్.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా వేసే ప్రతీ అడుగూ చంద్రబాబు మేలు కోరే దిశగానే సాగుతుందని వైసీపీ నేతలు నిత్యం విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈ విషయాలపై పవన్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... జనసేన టీడీపీకి బీ టీమ్ అనడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వారాహి యాత్రలో భాగంగా... తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన నాయకులు, మహిళలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. "వైసీపీ వాళ్లు జనసేనని బీ టీమ్ అంటుంటే.. బయటి వాళ్లు అనడం వేరు.. మనవాళ్లు అనడం వేరు" అంటూ జనసేన నాయకులకు ఆయన సూచించారు పవన్!
ఈ సందర్భంగా... "బయటి వాళ్ల కంటే జనసేన నాయకులు నమ్మకపోవడం చాలా ఇబ్బంది అని.. మనవాళ్లు నన్ను సందేహిస్తారు" అని పవన్ అన్నారు.
ఈ సందర్భంగా... రాజకీయాల్లో ప్రలోభాలు ఉంటాయని.. వాటిని దాటుకుని వెళ్లడమే నైతిక రాజకీయమని పవన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో లేదా నేరుగా జరుగుతున్న దాడికి ఎదురుదాడి చేయడం నేర్చుకోవాలని ఈ సందర్భంగా జనసేన నాయకులకు పవన్ సూచించారని తెలుస్తుంది.
2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించానన్న పవన్.. అప్పటికి రాజకీయ పార్టీ ప్రారంభం కాలేదని తెలిపారు. తర్వాత మొదలైన పార్టీ (ప్రజారాజ్యం) ని జాతీయ పార్టీలో కలిపేస్తే తాను ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్లలేదన్నారు. ఐదేళ్లకొకసారి సిద్ధాంతాలు మార్చుకునే పార్టీ జనసేన కాదంటూ పవన్ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామ సచివాలయాలతో పని ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఉద్దేశించి "జగ్గుబాయ్" అన్నారని తెలుస్తుంది. దీంతో... వెటకారం శృతిమించిందనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!