Begin typing your search above and press return to search.
పవన్ పోటీ చేసే సీటు... ఆరు ఆప్షన్లు...!
By: Tupaki Desk | 2 July 2023 2:07 PM GMTజనసేన అధినేత సినీ సెలిబ్రిటీ. పవర్ స్టార్ ఇమేజ్ ఉన్న వెండితెర కధానాయకుడు. ఆయన ఏమి చేసినా సంచలనమే. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నదే ఇపుడు అందరిలోనూ చర్చ. అభిమానులు అయితే తామున్న చోట నుంచి పోటీ చేయమని కోరుతున్నారు.
ఇక పవన్ గత ఎన్నికల్లో విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం నుంచి కూడా రెండవ సీటుకు పోటీ పడ్డారు. రెండు చోట్లా ఆయన ఓటమి పాలు అయ్యారు. 2024 ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.
అయితే జనసేనాని ఆలోచనలు ఆయన ప్రకటనలు ఆయన ఫోకస్ అన్నీ చూస్తూంటే ఆయన వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల నుంచే పోటీ చేస్తారు అని అంటున్నారు. పవన్ సైతం గోదావరి జిల్లాలను ఒడిసిపడదాం, మొత్తం 34 సీట్లను కైవశం చేసుకుందామని క్యాడర్ కి పిలుపు ఇస్తున్నారు.
వైసీపీకి ఎక్కడా చోటు ఇవ్వరాదని అంటున్నారు. అంటే గోదావరి మీద పవన్ కి అంత నమ్మకం ఉంది. ఇక వారాహి యాత్ర మొదటి దశ పూర్తి సందర్భంగా పవన్ భీమవరంలో జరిగిన సభలో మాట్లాడుతూ భీమవరం తన నేల అన్నారు. అణువణువూ తెలుసు అన్నారు. తాను పాతికేళ్ళ పాటు కూలీగా ఈ గడ్డ మీద పనిచేస్తాను అన్నారు.
దానిని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీకి దిగుతారు అనే అంటున్నారు. ఆయన ఓడిన చోట నుంచే మళ్లీ పోటీ చేసి గెలవడం ద్వారా అధ్బుతమైన విజయం అందుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇక పవన్ పోటీ చేసే లిస్ట్ లో ముమ్మిడివరం ఒకటి ఉంది. అక్కడ కూడా ఆయన ప్రజలకు తనను గెలిపించాలని కోరారు.
అదే విధంగా పిఠాపురంలో కూడా పవన్ జెండా పాతుతామని అన్నారు ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని కూడా అన్నారు. కాకినాడ అంటే చెప్పనక్కరలేదు. ఆయన అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సవాల్ చేశారు. ఈసారి నిన్ను ఓడించకపోతే పవన్ కళ్యాణ్ ని కాను అంటున్నారు. దాంతో కాకినాడ నుంచి పవన్ పోటీ పడవచ్చు అని తెలుస్తోంది. ద్వారంపూడి కూడా నాతో పోటీకి రమ్మని పవన్ కి సవాల్ చేశారు.
ఇక గాజ్వాక కూడా పవన్ కి మరో ఆప్షన్ గా ఉంది. ఎందుకంటే ఇది 2009లో ప్రజారాజ్యం గెలిచిన సీటు. ఇక్కడ 2019లో పవన్ పోటీ చేసి ఓడారు. దాంతో పాటు ఇక్కడ కాపులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఉత్తరాంధ్రా మొత్తం మీద ప్రభావం చూపించవచ్చు అన్నది పవన్ ఆలోచన అని చెబుతున్నారు. ఇవి కాకుండా తిరుపతి నుంచి కూడా పవన్ పోటీ చేయబోతారు అన్న టాక్ ఉండనే ఉంది. సో పవన్ చేతిలో ఆరు ఆప్షన్లు ఉన్నాయని అంటున్నారు. మరి పవన్ వీటిలో ఏ ఒక్కటి దాన్ని ఎంచుకుంటారో లేక గతంలో పోటీ చేసినట్లుగా రెండు సీట్లు సీట్లలో పోటీకి దిగుతారో చూడాలి.