Begin typing your search above and press return to search.
బట్టలూడదీయడం...ఎంత సరదా బాస్ ...?
By: Tupaki Desk | 26 Jun 2023 8:00 AM GMTరాజకీయ పరిభాష మారుతోంది. తిట్లూ శాపాలు దాటిపోయి హింసాత్మకమైన భాషను నేతలు అలవాటు చేసుకుంటున్నారు. వారు అన్నారని వీరు, వీరు అన్నారని మరొకరు ఇలా అత్యంత తీవ్రమైన భాషను వాడేస్తున్నారు. దాని వల్ల తాము మాట్లాడేది జనాల్లో తొందరగా వెళ్ళి వైరల్ అవుతుందని భావిస్తూండవచ్చు. కానీ అదే టైం లో హుందాతనం ఏమైపోతోంది. ఆ మాటలు అన్న తరువాత సదరు నాయకుడు వ్యక్తిత్వం కూడా అందులోనే ఇమిడి ఉంటుందు అన్న సత్యాన్ని ఎంత తేలిగ్గా మరచిపోతున్నారు అన్నదే కదా ఇక్కడ పాయింట్.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే బట్టలూడదీసి కొడతాం, రోడ్ల మీద పరుగులు పెట్టిస్తాం, తాట తీసి మోకాళ మీద కూర్చోబెట్టిస్తాం, గుండు కొట్టిస్తాం లాంటి భీకరమైన పదాలు వాడుతూ వస్తున్నారు. ఆయన ఈ పదజాలం వాడడం ఇప్పుడే కాదు 2009 ఎన్నికల నుంచే మొదలెట్టారు. అన్న చిరంజీవి ప్రజారాజ్యం అధ్యక్షుడు అయితే యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ అప్పట్లో పంచెలూడదీసి కొడతామని చెప్పి సంచలనం రేపారు.
ఆ భాషను ఆయన ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. అప్పడు అయితే ఆయన అన్న చాటు తమ్ముడిగా రాజకీయ సాయం చేశారు, ఇపుడు ఆయనే జనసేన అధినేతగా ఉన్నారు. దాంతో భాషను వాడేటపుడు సంయమనం పాటించాలి అన్నది చూసుకోవాల్సి ఉంది. కానీ పవన్ సినిమా హీరో. ఆయన ఏ భాష వాడినా ఆయన సభకు వచ్చే జనాలకు హుషార్ గానే ఉంటోంది.
కానీ తటస్థులకు సగటు జనాలకు మాత్రం ఈ భాష వాడకం జుగుప్సాకరంగానే ఉంది అంటున్నారు. ఇక జనసేనని గుడ్డలూడదీసికొడతామని అంటే వైసీపీ నేతలు కూడా దాన్ని పెద్దది చేసి మరింత అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. నెల్లూరుకి చెందిన ప్రసన్నకుమార్ రెడ్డి అయితే అంత చూడాలని సరదా ఉంటే గుడ్డలూడదీసుకుని మేమే నీ ముందుకు వస్తామని పవన్ కి సవాల్ చేసేలా మాట్లాడడం విడ్డూరమే.
మరో వైపు చూస్తే మంత్రి అంబటి రాంబాబు కూడా ఇలాగే వెటకారం జోడించి మాట్లాడుతున్నారు. పవన్ గుడ్డలూడదీస్తాను అంటే అంత తేరగా ఉన్నామా మేము అని ఆయన సాగదీసి మరీ మాట్లాడుతున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం వంటి వారు ఇది సినిమా కాదని పవన్ కి హెచ్చరిస్తున్నారు. ఇలా అయిఏ ఎంతమందికి గుండ్లు కొట్టించావ్ తాటతీశావో లెక్క చెప్పు అంటున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ కి చెందిన ఏపీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు కూడా ఇపుడు ఇదే భాష వాడడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తీస్తున్న వ్యూహం మూవీలో తమ నాయకురాలు సోనియా గాంధీ మీద తప్పుగా చూపించినా విలన్ గా చేసినా ఆర్జీవీ బట్టలూడదీస్తామని కొడతామని హెచ్చరించారు.
అసలు ఈ గుడ్డలూడదీయడం ఏంటబ్బా అన్నదే అందరికీ పట్టుకున్న ప్రశ్న. ఎదుటి వారిని విమర్శించాలంటే తెలుగులో పదాలే లేవా, గట్టి మాటలకే కొరత వచ్చిందా. యాభై ఆరు అక్షరాల తెలుగు భాషలో ప్రతీ భావోద్వేగానికీ పదాలు ఉన్నాయి అంటారు. మరి రాజకీయ నాయకులకు ఆ పదాలు తెలియవా తెలిసినా అవి నచ్చడంలేదా. ఇలా నేలబారుడు దిగజారుడు భాషను పట్టుకుని విమర్శలు చేసుకోవడమేంటని అంటున్నారు జనాలు. గుడ్డలూడదీయం అంటే అంత సరదా అయితే మనకు ఇపుడు ఆదర్శం శ్రీరాముడు కాదు, దుశ్శాసనుడే అని కూడా సెటైర్లు పడుతున్నాయి.