Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌కు ప్రాణ‌హాని.. ఈ వ్యాఖ్య‌ల్లో నిజ‌మెంత‌...?

By:  Tupaki Desk   |   19 Jun 2023 8:00 AM GMT
ప‌వ‌న్‌కు ప్రాణ‌హాని.. ఈ వ్యాఖ్య‌ల్లో నిజ‌మెంత‌...?
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని చెప్పా రు. అంతేకాదు.. త‌న ప్రాణాలు తీసేందుకు వైసీపీకి చెందిన కొంద‌రు ప్ర‌య‌త్నించార‌ని కూడా వ్యాఖ్యా నించారు. ఇక‌, ఈ విష‌యాన్ని కొన‌సాగిస్తూ.. వైసీపీ అధికారంలోకి రాకుండా.. తాను అడ్డుప‌డుతున్నాన‌నే ఆలోచ‌న 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నేత‌లు బ‌లంగా న‌మ్మార‌ని.. అందుకే త‌న‌ను లేపేయాల‌ని ప్లాన్ చేశార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. వైసీపీ నేత‌లు చేసిన కుట్ర ప్లాన్ కూడా త‌న‌కు తెలుసున‌ని.. ప‌వ‌న్ చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. 2014కు ముందు ప‌వ‌న్ పార్టీ పెట్టిన ద‌రి మిలా.. ఆయ‌న నోటి నుంచి అనేక వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ, ఎప్పుడు కూడా త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌నికానీ.. త‌న‌ను చంపేందుకు ప్లాన్ చేశార‌ని కానీ.. ఇన్నాళ్ల‌లో ఎప్పుడు చెప్ప‌లేదు. దీంతో ఇప్పుడు చేసిన ప్ర‌క‌ట‌న‌.. చ‌ర్చ‌కు దారితీసింది.

ఇందులో పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఎందుకంటే.. నిజానికి ప‌వ‌న్ త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని ప్ర‌క‌టించిన వెంట‌నే రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న అభిమానులు ఆందోళ‌న‌కు దిగి ఉండాలి. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. అంతేకాదు.. అస‌లు ప‌వ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌లో సీరియ‌స్ నెస్ కూడా క‌నిపించ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. అందునా.. ఎప్పుడో జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఇప్పుడు తెర‌మీద‌కి తీసుకురావ‌డం ద్వారా ప‌వ‌న్ సాధించేది ఏంట‌నే చ‌ర్చ కూడా వ‌స్తోంది.

అంటే.. ప్ర‌జ‌ల‌ను ఏదో ఒక ర‌కంగా త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డంలో భాగంగానే ప‌వ‌న్ ఇలాంటి సెంటిమెంటును తెర‌మీదికి తెచ్చారా? ఒక‌వేళ ఆ కుట్ర నిజ‌మే అయితే.. అది కూడా త‌న‌కు తెలిసి ఉంటే.. ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్ప‌టి వ‌ర‌కు అటు కేంద్రానికో.. ఇటు రాజ‌కీయంగానో.. దానిని ఎందుకు.. ప్ర‌జ‌ల్లోకి తీసుకురాలేదు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రి ప‌వ‌న్ వ్యూహం ఏంటో చూడాలి.