Begin typing your search above and press return to search.
ఆదర్శాలు వల్లించే పవన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటమా?
By: Tupaki Desk | 15 April 2023 9:24 AM GMTనిజాయితీని శంకించాల్సిన అవసరం లేని రాజకీయ అధినేతలు.. నేతలు చాలా అరుదుగా ఉంటారు. ఇవాల్టి రోజుల్లో రాజకీయాలు అన్నీ కూడా లెక్కల చుట్టూనే తిరుగుతుంటాయి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. ఆదర్శాలు వల్లిస్తూ రాజకీయాల్ని చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాస్తంత రోటీన్ కు భిన్నమైన అధినేతగా కనిపిస్తారు. పవన్ మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్యాకేజీ స్టార్ అంటూ ఫైర్ అయినప్పటికీ.. వాస్తవంలో మాత్రం ఆ ఆరోపణల్ని రుజువు చేసే ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని చూపించకపోవటాన్ని మర్చిపోకూడదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా తన పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన సోదరుడు కొణిదెల నాగబాబును నియమించిన వైనం ఆసక్తికరంగా మారింది. నిత్యం నీతులు బోధిస్తూ.. ఆదర్శాలు వల్లిస్తూ వ్యవహరించే పవన్.. తన పార్టీని తన కుటుంబ సభ్యుడికి కీలక పదవిని ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. పవన్ వల్లించే ఆదర్శాల్ని చూసినప్పుడు కుటుంబ సభ్యులకు పార్టీలో కీలక స్థానాల్లో కూర్చోబెట్టకూడదు. కానీ.. అందుకు భిన్నంగా నాగబాబు పార్టీలో కీలక పదవిని అప్పగిస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు.. ఎన్ ఆర్ఐ సేవల్ని పార్టీకి ఉపయోగపడేలా సమన్వయం చేసే బాధ్యతను మెగా బ్రదర్ కు అప్పగించటం గమనార్హం. మరోవైపు మేకలపాటి అజయ్ కుమార్ ను జాతీయ మీడియా ప్రతినిధి గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు రాజకీయ శిక్షణ తరగతులు.. అంతర్గత క్రమశిక్షణ.. బూత్ స్థాయి పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నట్లుగా మాట్లాడే పవన్ ఆదర్శాలు మాటల్లోనే తప్పించి.. చేతల్లో కనిపించవా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. దీనికి పవన్ ఎలాంటి లాజిక్ చెబుతారో చూడాలి. కుటుంబ సభ్యులు పార్టీలో ఉండటం తప్పు కాదు కానీ.. వారికి పార్టీలో ముఖ్యమైన స్థానాల్లో కీలకమైన బాధ్యతల్ని అప్పగించేలా నిర్ణయంపై చర్చ జరుగుతోంది.