Begin typing your search above and press return to search.
బీజేపీని ఏసుకున్నపవన్.. పొత్తుకు బ్రేకులు పడినట్లేనా?
By: Tupaki Desk | 15 March 2023 12:10 PM GMTజనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మచిలీపట్నం వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు అంశాల మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తనకు బీజేపీ మీద ఉన్న అసంత్రప్తిని ఆయన దాచుకునే ప్రయత్నం చేయలేదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేయటం ద్వారా.. తన క్లారిటీ తాను ఇచ్చేశారని చెప్పాలి. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలన్న ఆశకు కమలనాథుల నుంచి సానుకూల స్పందన లేదన్న విషయంపై పవన్ తేల్చేశారని చెప్పాలి.
గతంలో తాను బీజేపీ అధినాయకత్వం ఇస్తానని చెప్పిన రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా పవన్ చెప్పటం తెలిసిందే. ఇప్పటివరకు తనకు రోడ్డు మ్యాప్ అందలేదన్న పవన్ మాటల్ని చూస్తే.. బీజేపీ నేతలతో ఆయనకు దూరం పెరిగిందన్న విషయాన్ని చెప్పేందుకు వెనుకాడలేదు. అందుకు ఆయన మాటలే నిదర్శనం. బీజేపీ నేతలు.. వారి తీరుపై పవన్ మొహమాటం లేకుండా వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారన్నది చూస్తే..
- నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని అన్నానంటే దానికి కారణాలు ఉన్నాయి. బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నా. ఇక్కడి బీజేపీ నేతలు కలిసి రావటం లేదు. రాష్ట్రస్థాయి కార్యక్రమాలు చేయటానికి ఇక్కడి వారు ముందుకు రావటం లేదు.
- మేం అనుకున్న ప్రణాళికను అమలు చేసి ఉంటే.. ఇప్పుడు టీడీపీతో అవసరం లేని స్థాయికి ఎదిగేవాళ్లం. అమరావతి రాజధాని అని చెప్పారు. ఒక లాంగ్ మార్చ్ పెడదామన్నాను. పార్టీ బలోపేతం అవుతుందని చెప్పాను. అందుకు ఢిల్లీలో ఒప్పుకున్నారు. సాయంత్రానికి అదేం లేదని అన్నారు.
- కలిసి కట్టుగా కార్యక్రమాలు నడపకపోతే నేనేం చేయాలి? అమ్మా పెట్టదు. అడుక్కు తిననివ్వదు అన్నట్లుంది. మీరు చేయరు. నన్నూ చేయనివ్వరు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వం ముందుకు తీసుకెళ్లాను. నేను అనుకున్నట్లుగా జరిగి ఉంటే.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో తెలుగుదేశం అనేదే వచ్చేది లేదు.
- దేశానికి బలమైన నాయకుడు కావాలన్న ఉద్దేశంతో మోడీ నేత్రత్వంలోని బీజేపీకి మద్దతు ఇచ్చా. మేం తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటే.. నువ్వు ఆంధ్రావాడివి. ఇక్కడెలా పోటీ చేస్తావని స్థానిక బీజేపీ నేతలు అన్నారు.
- ఆంధ్రావాళ్ల ఓట్లు కావాలి కానీ పోటీ చేయొద్దంటే ఎలా? అక్కడా మాకు అభిమానులు ఉన్నారు. నేను బీజేపీకి అండగా నిలబడ్డా. వారే ముందుకు తీసుకెళ్లటం లేదు.
ఇలా బీజేపీ మీద తనకున్న అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. ఈ సందర్భంగా బీజేపీ అధినాయకత్వం తనతో సరిగా ఉన్నా.. ఇరు రాష్ట్రాల్లోని వారు సరిగా లేరన్న విషయాన్ని పవన్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. ఇదంతా చూసినప్పుడు బీజేపీతో తన బంధాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా లేరని చెప్పక తప్పదు. టీడీపీతో కలిసి ముందుకు వెళ్లాలన్న విషయాన్ని క్లియర్ గా చెప్పిన పవన్.. బీజేపీతో మాత్రం కలిసి వెళ్లే విషయంలో సానుకూలంగా లేరన్న భావన కలిగేలా ఉందని చెప్పాలి. ఇదంతా చూస్తే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కంటే కూడా టీడీపీతో పొత్తుతోనే ముందుకు వెళ్లాలన్న అభిప్రాయాన్ని పవన్ చెప్పినట్లుగా చెప్పాలి.