Begin typing your search above and press return to search.

జగన్ కి పీకే టీం...బాబుకు రాబిన్ బ్యాచ్...పవన్ కి ఎవరు...?

By:  Tupaki Desk   |   21 Nov 2022 12:30 AM GMT
జగన్ కి పీకే టీం...బాబుకు రాబిన్ బ్యాచ్...పవన్ కి ఎవరు...?
X
ఏపీలో రాజకీయం పూర్తిగా టెక్నాలజీని సంతరించుకుంటోంది. స్ట్రాటజీస్ బుర్రల్లో పుట్టడంలేదు, ఎదుటి వారి మైండ్ లోనే పుట్టిస్తున్నారు వాటితోనే తమకు అనుకూలంగా చేసుకుని స్మార్ట్ గా గేమ్ ఆడేస్తున్నారు. దాని కోసం ప్రత్యేకంగా స్ట్రాటజీ టీమ్స్ రెడీ అయిపోయాయి. గత దశాబ్ద కాలంలో వ్యూహకర్తలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

సోషల్ మీడియా యుగంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ శకంలో వారి పాత్ర అమాంతం పెరిగిపోయింది. గుజరాత్ సీఎం నుంచి దేశానికి పీఎం కావడానికి మోడీ ప్రశాంత్ కిశోర్ అనే వ్యూహకర్తను వాడుకున్నారు. మంచి ఫలితాలు పొందారు నాటి నుంచి దేశమంతా వ్యూహకర్తలను నియమించుకోవడం వివిధ పార్టీలలో మొదలైంది.

ఏపీలో 2019 ఎన్నికల ముందు అలాగే పీకే టీం ని జగన్ మొదటిసారిగా వాడుకున్నారు. బంపర్ హిట్ అయి సీఎం కూడా అయ్యారు. ఆనాడు తెలుగుదేశం పర్టీకి చెందిన నాయకులు పీకే టీం తో వ్యూహాలా అని ఎద్దేవా చేశారు. మాకు చంద్రబాబు లాంటి రాజకీయ చాణక్యుడు ఉన్నారు. ఆయన వ్యూహాల ముందు ఎవరైనా బలాదూర్ అని చెప్పుకున్నారు. పైగా మాకు ఎవరి వ్యూహాలూ అవసరం లేదని కూడా గట్టిగా ప్రకటించుకున్నారు.

కానీ 2019 ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీకి అర్ధమైంది ఏంటి అంటే వ్యూహకర్త తమకూ ఉండాలని. అలా సునీల్ అని ఒక వ్యూహకర్తను నియమించుకున్నారు కానీ ఆయన తెలంగాణా కాంగ్రెస్ కి పనిచేయడానికి వెళ్లారు. దాంతో ఇపుడు గుజరాత్ కి చెందిన రాబిన్ శర్మను తెచ్చారు. ఆయన మోడీ ప్రధాని అభ్యర్ధిగా ఫస్ట్ టైం పోటీ చేస్తున్న క్రమంలో వ్యూహరచన చేసిపెట్టిన పీకే టీమ్ లో కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి పీకే టీం లో ఉంటూ ఆ తరువాత సొంతంగా వివిధ పార్టీలకు వ్యూహాలను రూపొందిస్తూ బిజీగా మారారు.

ఆయన్ని తొలిసారిగా అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పార్టీ జనాలకు చంద్రబాబు పరిచయం చేశారు. బాబు వంటి రాజకీయ దురంధరుడు ఉండగా రాబిన్ శర్మ వ్యూహకర్తగా అదే వేదిక పైనా ఉండడం మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది అని చెప్పాలి.

మరో వైపు చూస్తే రాబిన్ శర్మ పీకే టీం లో పనిచేసి ఉండడం వల్ల ఆ పట్లూ గుట్లూ అన్నీ తెలిసి ఉన్న వారు. దాంతో రివర్స్ స్ట్రాటజీతో వైసీపీకి గట్టి కౌంటర్ ఇవ్వడానికి అన్నీ రెడీ చేసి ఉంచారని అంటున్నారు. ఇక గడపగడపకు అంటూ వైసీపీ జనాల్లోకి వెళ్తూంటే కౌంటర్ గా ఇదేమి ఖర్మ అంటూ టీడీపీ తమ్ముళ్ళు వైసీపీని టార్గెట్ చేస్తూ కదలనున్నారు.

దీంతో ఏపీలో పీకే వర్సెస్ రాబిన్ శర్మ అన్నట్లుగా కొత్త పాలిటిక్స్ మొదలైంది. అటూ ఇటూ కూడా గట్టివారే. పైగా ఆ వైపున అధికారంలో జగన్ ఉన్నారు. ఈ వైపున అనుభవశాలి చంద్రబాబు ఉన్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య భీకర సమరం సాగడం ఖాయం. మరి మూడవ పార్టీగా వస్తున్న జనసేనకు వ్యూహకర్త ఎవరు అన్నది ప్రశ్నగా ఉంది. పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా నిండా ఫ్యాన్స్ ఉన్నారు.

అలాగే జనంలో అభిమానులు ఉన్నారు. అయితే సాదా జనం మైండ్ ని పట్టుకుని గేమ్ ఆడాల్సిన ఎన్నికలు ఇవి. అలాగే వారితో డైరెక్ట్ గా కనెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. మరి జనసేన ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి. అంగబలం అర్ధంబలంలో వైసీపీ టీడీపీ సమ ఉజ్జీలే. మరి ఆ ఇద్దరితో అన్ని విధాలుగా నెగ్గి ఫోర్ ఫ్రంట్ లో నిలవాలంటే జనసేనకు కూడా ఒక వ్యూహకర్త అవసరమా అన్న చర్చ ఉంది.

అయితే రాజకీయాల్లో అన్నీ కరెక్ట్ కావు, అన్నీ సక్సెస్ ని ఇవ్వవు. జనాలను మెప్పించేందుకు తొంబై తొమ్మిది దారులు ఉంటాయి. కానీ గెలిచేందుకు ఆ ఒక్క దారి చాలా ఇంపార్టెంట్. దాన్ని కనుక పవన్ పట్టుకుంటే ఏ వ్యూహాలూ అవసరం లేదని ఆ పార్టీ వారు అంటున్నారు. సో రేపటి యుద్ధంలో అర్జునుడూ క్రిష్ణుడూ రెండూ మా పవనే అని వారు చెబుతున్నారు. సో చూడాలి ఎలా ఉంటుందో జనసేన సమర సన్నాహం.