Begin typing your search above and press return to search.

పవన్ ఊపుకు బ్రేకులు వేయటమే కొత్త కేసు లక్ష్యమా?

By:  Tupaki Desk   |   13 Nov 2022 7:05 AM GMT
పవన్ ఊపుకు బ్రేకులు వేయటమే కొత్త కేసు లక్ష్యమా?
X
రాజకీయాలు యమా తమాసాగా ఉంటాయి. ఇద్దరు మొండి వారు తలపడితే ఎలా ఉంటుందన్న విషయం ఏపీ రాజకీయాల్నిచూస్తే ఇట్టే అర్థమవుతుంది. రాజకీయప్రత్యర్థుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారన్నది ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసంర లేదు. రాజకీయ ప్రత్యర్థులపై ఆయన తీసుకునే నిర్ణయాలు రోటీన్ రాజకీయాలకు భిన్నంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కనిపించని కొత్త రాజకీయంగా చెప్పక తప్పదు.

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసుల తీరు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీసినట్లుగా చెబుతున్నారు. ఇది కచ్ఛితంగా రాజకీయంగా తీసుకున్న ప్రతీకార చర్యగా పవన్ మీద తాజా కేసు నమోదుపై జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్ద రోజుల క్రితం ఇప్పటం గ్రామానికి వెళ్లే వేళలో.. పవన్ కల్యాణ్ వేసిన సాహసోపేతమైన స్టంట్ కు షాకిచ్చేలా కేసు నమోదు చేశారంటున్నారు.అయితే.. ఈ కేసు నమోదు వెనుక అసలు లెక్కలు వేరే ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.

ఇప్పటం ఎపిసోడ్ ను అసరాగా చేసుకొని పవన్ కల్యాణ్ మీద కేసు నమోదు చేయటం వెనుక అసలు కారణం ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు విశాఖకు వచ్చిన పవన్ కల్యాణ్.. తనకున్న పలుకుబడిని చేతల్లో చూపించినట్లుగా జనసేన వర్గాలు ప్రచారం చేసుకున్నాయి. అంతేకాదు.. ప్రధాని మోడీతో భేటీ.. ఆయన ఇమేజ్ ను అమాంతం పెంచేసిందన్న మాట వినిపిస్తోంది.

దీనికి కౌంటర్ గానే కొత్త కేసు నమోదు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయినా.. 40 నిమిషాల పాటు మాట్లాడినా.. తాము పెద్దగా పట్టించుకోమని.. పవన్ ను అల్రెడీ రాడార్ లో తీసుకొచ్చేసిన విషయాన్ని తాజా కేసు నమోదుతో స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మోడీకి మిత్రుడన్న ట్యాగ్ లైన్ ను తాము లెక్కలోకి తీసుకోమని..అలాంటి వాటిని పిచ్చ లైట్ గా తీసుకుంటామన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయటానికే ఇప్పటం ఎపిసోడ్ లో పవన్ పై కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.

మరింత ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ప్రధాని నరేంద్రమోడీని భేటీ అయిన పవన్ కు షాక్ తగిలేలా.. డబుల్ గిఫ్టుల్ని జగన్ సర్కారు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావటం ద్వారా.. తన సత్తాను పవన్ చాటితే.. ఇలాంటి వాటినితాముఅస్సలు పట్టించుకోమని.. లెక్కలు తేడా వచ్చే ఏ చిన్న విషయాన్ని వదిలేది లేదన్న విషయాన్ని జనసేన అధినేత మీద కేసు.. ఆ పార్టీకి చెందిన మరో నేతపై కేసు నమోదు చేయటం ద్వారా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తాజా చర్యతో తాము ఇవ్వాలనుకున్న మెసేజ్ ను క్లియర్ గా పవన్ కు జగన్ అండ్ కో ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు.