Begin typing your search above and press return to search.

ఇంట్రడక్షన్ సీన్ కా బాప్....గూస్‌బంప్స్ అంతే...

By:  Tupaki Desk   |   6 Nov 2022 9:47 AM GMT
ఇంట్రడక్షన్ సీన్ కా బాప్....గూస్‌బంప్స్ అంతే...
X
పవర్ స్టార్ అని ఆయన్ని ఎందుకు అంటారో సినిమాలు చూస్తే తెలియదేమో. రియల్ లైఫ్ లో ఆయన ఆవేశాన్ని చూసినపుడు ఆయన దూకుడుని చూసినపుడు మాత్రం పవర్ టన్నుల కొద్దీ ఉందని అర్ధమవుతుంది. ఇప్పటం వెళ్లాలన్న పవన్ పట్టుదల ఆయన చేత ఎంత పని చేయించిందంటే తన కారు టాప్ మీద కూర్చుని ట్రావెల్ చేసేటంతగా. జోరుగా కారు, టాప్ పైన పవన్. ముందూ వెనకాల టూ వీలర్స్ మీద ఫ్యాన్స్. ఇదీ సీన్.

పవన్ పాతిక సినిమాల్లో దేంట్లో అయినా ఇలాంటి సీన్ చూశారా. అసలు చూసి ఉండరు. నిజానికి పవన్ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయే రేంజిలో ఉంటుంది. వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. అవి చూసి ఫ్యాన్స్ హాల్స్ లో మోతెక్కిస్తారు. కానీ ఇపుడు అలాంటి ఇంట్రడక్షన్ సీన్ కా బాప్ అన్నట్లుగా ఇప్పటానికి కారు టాప్ మీద కూర్చుని పవన్ రావడం అంటే ఫ్యాన్స్ కేరింతలు చెప్పాల్సిన అవసరం లేదు.

ఇలా రియల్ లైఫ్ లో ఒక రేర్ రిస్కీ ఫీట్ ని చేసి పవన్ తన ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ పంచేశాడు. ఇదిపుడు సోషల్ మీడియాలో సూపర్ డూపర్ గా వైరల్ అవుతోంది. పవన్ అభిమానులే కాదు జనసైనికులు కూడా దీన్ని చూసి నిజాయతీకి పొగరుంటే అది మా పవనే. అందుకే ఆ దూకుడు అంటూ కితాబులు ఇస్తున్నారు.

వాటిని షేర్ చేస్తూ కామెంట్స్ పెడుతూ రెచ్చిపోతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ డ్రోన్ షాట్స్ ఎంతలా వైరల్ అయ్యాయో కానీ దీని వల్ల పవన్ లాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ రోడ్ల మీద చేసే రిస్కీ ఫీట్స్ ని తామూ చేయాలని యూత్ అనుకుంటేనే అది ప్రమాదంలోకి వారిని నెడుతుంది.

అసలే యువత వారి జోరుకు హద్దూ అదుపూ ఉండదు. మరి అలాంటి వారికి అభిమాన హీఒరో గా ఉన్న పవనే ఇలా చేస్తే వారు రేపటి రోజుల వారూ అనుసరించే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ఇక ట్రాఫిక్ రూల్స్ ప్రకారం చూస్తే ఇలా కారు టాప్ పైన ప్రయాణించడం ప్రమాదం, నిబంధలనకు విరుద్ధం.

అలాగే హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనాల మీద జోరుగా డ్రైవ్ చేయడం, ముగ్గురేసి కలసి ప్రయాణించడం ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేసేవే. వీటి గురించి కూడా ఇపుడు చర్చ సాగుతోంది. పవన్ చేసిన ఈ రిస్కీ ఫీట్ ఏపీ రాజకీయాల పట్ల ఆసక్తి లేని వారు సైతం చూసి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.