Begin typing your search above and press return to search.
పవన్ హత్యకు రెక్కీ..? జనసేన కంటే టీడీపీ హడావుడే ఎక్కువ
By: Tupaki Desk | 6 Nov 2022 6:46 AM GMTఎన్నికలకు ఏడాదిరన్న ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కుతున్నాయి. పాదయాత్రలు.. బస్సు యాత్రలు.. నిరంతర పర్యటనలతో ప్రతిపక్ష టీడీపీ, జనసేన ప్రణాళికల్లో ఉండగా.. మూడు రాజధానులు.. అభివ్రద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఎజెండాతో జగన్ సర్కారు ధీమా కనబర్చుతోంది. అయితే, మధ్యలో అసలు సిసలైన రాజకీయ డ్రామా సాగుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు.. జన సేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఎప్పుడూ సాగే వైసీపీ సర్కారు విమర్శలు.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలోకి వచ్చాయి. పవన్ విశాఖపట్నం పర్యటనను వైసీపీ సర్కారు అడ్డుకోవడం.. ఆనక ఆయనను హోటల్ కు పరిమితం చేయడం.. అక్కడనుంచి విజయవాడ వచ్చేసిన పవన్ ను అనూహ్యంగా చంద్రబాబు కలవడం.. ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొనడం ఇలా పరిణామాలు ఒకదానివెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. అయితే, చంద్రబాబు- పవన్ ను కలవడాన్ని వైసీపీ తనకు అనుకూలంగా రాసుకోగా.. పవన్ వ్యూహాత్మక తప్పిదం చేశారంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
విజయవాడ నుంచి జూబ్లీ హిల్స్ నివాసం దాకా
ఏపీ రాజకీయం విజయవాడ నుంచి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి మారినట్లయింది. పవన్ ఇంటివద్ద కొన్ని రోజులు కొందరు యువకులు కారు నిలిపి ఉంచడం.. దీనిని ప్రశ్నించిన భద్రతా సిబ్బందిన పట్ల దురుసుగా ప్రవర్తించడం.. విషయం పోలీసు ఫిర్యాదు వరకు వెళ్లడం జరిగిపోయాయి. మరోవైపు పవన్ కల్యాణ్ భద్రతపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా స్పందించారు. ఈ విషయంలో పార్టీ పరంగా ఆయన తమ వాయిస్ వినిపించడం సహజమే. అయితే, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన
వ్యవహారం చర్చనీయాంశం అవుతున్న సమయంలో పవన్ శనివారం ఇప్పడం గ్రామానికి రావడం.. అభిమానులు, కార్యకర్తల సందడి మధ్య.. వైసీపీ సర్కారు కూల్చేసిన ఇళ్లను పరిశీలించడం జరిగిపోయాయి.
పవన్ భద్రతపై టీడీపీ ఉలుకే ఎక్కువ..
పవన్ కల్యాణ్ భద్రత అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గతంలో ప్రస్తావించారు. టీడీపీ నాయకులు కూడా కొందరు ఈ విషయమై స్పందించారు. మరోవైపు శనివారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యడు బొండా ఉమామహేశ్వరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ హత్యకు పథకం వేసి, రూ.250 కోట్ల సుపారీ ఇచ్చారని, అందులో భాగంగానే హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని ఆరోపించారు.
ఇక 'పవన్ కల్యాణ్ బహిరంగ సభకు స్థలం ఇవ్వడమే ఇప్పటం గ్రామస్థులు చేసిన నేరమా? గర్భిణులున్నా, కాళ్లావేళ్లా పడ్డా రోడ్డు విస్తరణ పేరిట లాఠీలతో కొట్టించి, ఇళ్లను కూల్చారు. విశాఖలో రూ.40వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని ప్రశ్నిస్తే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై అక్రమంగా కేసు పెట్టారు. గోడలు దూకి, మహిళలపై దౌర్జన్యం చేసి అయ్యన్న కుమారుడు రాజేశ్‌ను అర్ధరాత్రి అరెస్టు చేశారు' అని మండిపడ్డారు.
కమలాపురంలో జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి వక్ఫ్ భూములను ఆక్రమించి సినిమా హాళ్లు కడితే మాత్రం చర్యలు ఉండవా? అని ఆయన నిలదీశారు. 'నందిగామలో ఎమ్మెల్యే అనుచరులు చంద్రబాబు పర్యటనలో ఉన్నారు. వారికి అక్కడేం పని? 15 రాళ్లు విసిరారు. అదృష్టవశాత్తూ చంద్రబాబుకు ప్రాణాపాయం తప్పింది. ఆ రాయి సీఎస్‌వోకు తగిలి ఆయన గాయపడ్డారు. చంద్రబాబుపై జరిగిన హత్యాయత్నంలో స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను నిందితులుగా చేర్చి విచారణ చేయాలి' అని బొండా ఉమామహేశ్వరావు డిమాండ్ చేశారు.
రాజకీయంగా చేరువ కావాలనేననా...?
టీడీపీ సొంతంగా ఏపీలో జగన్ ను ఓడించలేదనే అభిప్రాయం బలంగా ఉంది. దీంతోనే ఆ పార్టీ పవన్ కల్యాణ్ అండ కోరుతున్నట్లు స్పష్టమవుతోంది. నేరుగా ఈ ప్రతిపాదన చేయలేక పరోక్షంగా దగ్గరయ్యే ప్రయత్నాలు సాగిస్తోంది. అందుకనే పవన్ ఇంటివద్ద యువకుల వివాదాన్ని ఎంచుకుని పవన్ పక్షాన మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. అందుకనే పవన్ హత్యకు రూ.250 కోట్ల సుపారీ అంటూ ఆరోపణలు సాగిస్తోంది. చూస్తుంటే.. ఈ విషయంలో జన సేన కంటే టీడీపీ హడావుడే ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.