Begin typing your search above and press return to search.
పవన్ని జారిపోనీయవద్దు...బీజేపీ వ్యూహమేంటి...?
By: Tupaki Desk | 25 Oct 2022 8:06 AM GMTఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇపుడు చాలా కీలకంగా మారుతున్నారు. ఆయనకు చట్టసభల్లో ఒక్కరే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. స్వయంగా ఆయన పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి పాలు అయ్యారు. అయినా పవన్ అంటే అన్ని పార్టీలు అలెర్ట్ అవుతున్నాయి. అధికార పార్టీ ఆయన మీద ఫుల్ ఫోకస్ పెడుతూంటే విపక్షంలో ఉన్న పార్టీ స్నేహం కోసం అర్రులు చాస్తున్నాయి. మొత్తానికి పవన్ 2024 ఎన్నికల రాజకీయాన్ని మార్చేసే కేంద్ర బిందువు అవుతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అదే నిజమని చెబుతున్నాయి.
పవన్ ఉన్నట్లుండి రాజకీయంగా ఒక స్టెప్ తీసుకున్నారు. ఆయన విజయవాడలో ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబుతో కరచాలనం చేశారు. ఈ ఒక్క పరిణామం ఇపుడు ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతోంది. జనసేన టీడీపీ రెండు కలసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏపీలో కలసి ఉద్యమించాలని నిర్ణయించాలి. వీలైతే మరిన్ని భాగస్వామ్య పార్టీలను కూడా చేర్చుకోవాలనుకుంటున్నాయి.
అయితే బీజేపీ మాత్రం టీడీపీతో కలిసే ప్రసక్తి లెదని చెబుతోంది. ఆ పార్టీ ఏపీ వ్యవహరాల ఇంచార్జి సునీల్ డియోధర్ అయితే వైసీపీ టీడీపీ రెండూ కుటుంబ పార్టీలు అని విమర్శించారు. తమకు ఏపీలో ఒకే ఒక పార్టీతో పొత్తు ఉందని అది జనసేన మాత్రమే అని ఆయన కచ్చితంగా చెప్పేశారు. ఇక టీడీపీ జనసేన చేతులు కలిపినా బీజేపీ కోసం ఎదురుచూస్తున్నాయి. చంద్రబాబుకు అయితే బీజేపీ తమతో జట్టు కట్టాలని 2014 నాటి పొత్తులు రిపీట్ కావాలని ఉంది. మరో వైపు పవన్ కూడా బీజేపీతో బంధం తెంచుకుంటున్నామని ఎక్కడా చెప్పడంలేదు.
దాంతో ఈ పొత్తుల కధ ఏంటో ఎటూ తేలకుండా ఉంది అనే అంటున్నారు. ఈ నేపధ్యంలో ఏపీకి చెందిన ఒక ముఖ్యనేత ఢిల్లీకి ఈ మధ్యన వెళ్ళి మరీ అక్కడ పార్టీలో రెండవ స్థానంలో ఉన్న కీలక నేతతో ఏపీ పొత్తుల గురించి చర్చించారు అని అంటున్నారు. ఈ ముఖ్యనేతకు ఆ కీలక నేత చెప్పిన విషయం ఇదీ అని ప్రచారం సాగుతోంది. అదేంటి అంటే ఏపీలో పవన్ని జారనివ్వకండి. ఆయన మనతోనే ఉంటారు. పొత్తులు కచ్చితంగా రెండు పార్టీల మధ్య కొనసాగుతాయి. పవన్ మనతోనే వేరేగా డౌట్లు పెట్టుకోవద్దు అని చెప్పారని అంటున్నారు.
ఇక బీజేపీ కీలక నేత మాటలను బట్టి చూస్తూంటే పవన్ తోనే మన పొత్తు అని మాత్రమే అంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు అయోమయంలో పడవద్దు అని కూడా అంటున్నారు. అలాగే టీడీపీతో పొత్తు గురించి మాత్రం ఎక్కడా చెప్పడంలేదు. దీంతోనే ఏపీ నేతలు పరేషాన్ అవుతున్నారు. ఏపీలో మూడు పార్టీలతో పొత్తులు ఉంటాయని అంతా అనుకుంటూంటే కేంద్ర పెద్దలు మాత్రం పవన్ తోనే దోస్తీ సుమా అని సందేశం వినిపిస్తున్నారు. పైగా పొత్తు కచ్చితంగా కొనసాగుతుంది అని ధీమాగా చెబుతున్నారు.
మరి పవన్ కళ్యాణ్ అయితే ఏపీలో జగన్ వ్యతిరేక ఓట్లు చీలరాదు అని పట్టుదల మీద ఉన్నారు. ఈ విషయంలో ఆయన మోడీ అమిథ్ షా వంటి కేంద్ర పెద్దల్ అభిప్రాయం ఎలా ఉంటుందో అన్నది తెలుసుకునేందుకు వేచి చూస్తున్నారు అంటున్నారు. కానీ కేంద్ర పెద్దలు మాత్రం టీడీపీ విషయంలో పొత్తులు ఉండవనే ఈ రోజుకీ చెబుతున్నారు. అయితే అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటే మూడు పార్టీల మధ్య పొత్తులు కచ్చితంగా కుదురుతాయని అన్న వారూ ఉన్నారు.
ఇక ఏపీ బీజేపీ నేతలు ఎవరూ పొత్తుల విషయంలో కొత్తగా ప్రకటనలు ఇచ్చి పరిస్థితిని గందరగోళంలో పడవేయవద్దు అని కూడా కేంద్ర పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ జనసేన చేతులు కలిపినా పొత్తుల విషయం లో అసలైన నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పెద్దలే అంటున్నారు. వారు కనుక ఒక డెసిషన్ తీసుకుంటేనే ఏపీలో పొత్తుల కధ సాఫీగా సాగుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.