Begin typing your search above and press return to search.
మూడు పెళ్ళిళ్ళే వైసీపీకి అతి పెద్ద ప్రాబ్లం
By: Tupaki Desk | 23 Oct 2022 1:30 AM GMTరాజకీయాల్లో ఉన్న వారికి హుందాతనం ఉండాలి. ప్రతీ వారి వ్యక్తిగత జీవితంలో తొంగి చూడాలనుకోవడం తగని పని. పైగా ఎవరూ ఇక్కడ పత్తిత్తులు కారు. ఆ మాటకు వస్తే మనిషి అన్న వాడే ఎక్కడో అక్కడ చిన్నా చితకో తప్పులు చేస్తారు. తన జాతకం బాలేక మూడు పెళ్ళిళ్ళు అలా చేసుకున్నాన్ సామీ అంటూ పవన్ ఎన్నో సార్లు మీడియా ముందు గోడు చెప్పుకున్నారు. ఆయన ఆ ఫ్లోలో నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకు బాధ. అసూయతో కనుక ఈ మాటలు అంటే మీరు కూడా చేసుకోండి అంటూ సెటైరికల్ గా అన్నారు.
అంతే తప్ప ప్రతీ వారూ మూడేసి పెళ్ళిళ్ళు చేసుకోమని ఆయన ఎక్కడా సందేశం ఇవ్వలేదు, ఆయన అదే అజెండాగా చేసుకుని ఉద్యమాలూ చేయడంలేదు. కానీ పవన్ లో ఈ మూడు పెళ్ళిళ్ల విషయమే పెద్ద తప్పుగా అదే మహిళా లోకానికి అసలైన సమస్యగా వైసీపీకి కనిపించడమే వింతలోకెల్లా వింత. ఏపీలో మహిళా సంరక్షణ కోసం ఏర్పాటు అయినా మహిళా కమిషన్ వారి సమస్యల విషయంలో ఎంత వేగంగా స్పందిస్తుదో ఎవరికీ తెలియదు కానీ వైసీపీకి రాజకీయ ప్రత్యర్ధులను చూసి మరీ గురి పెట్టే విషయంలో అయితే దూకుడు చేస్తోంది అనే చెప్పాలని అంటున్నారు.
లేకపోతే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు తప్ప మరో సమస్య లేనట్లుగా నోటీసులు ఇవ్వడమేంటి అన్న చర్చ నడుస్తోంది. నిజంగా మహిళా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏపీలో అనేక రకాలైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాగే మహిళల మీద వేధింపులు ఎక్కువ అవుతున్నాయి వాటి మీద దృష్టి ఎందుకు పెట్టరని ప్రశ్నలు వస్తున్నాయి. అదే విధంగా రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఒక యువతి గొంతు కోసి దారుణం చేశారు.
వీటికి ముందు అనేకం ఏపీలో జరిగాయి. వాటి మీద మొదట్లో ఉన్న సీరియస్ నెస్ ఆసక్తి అయితే జనంలో తగ్గిపోవడానికి అవి రొటీన్ అయిపోయాయి అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా నేరాలను ఘోరాలను అదుపులో ఉంచడం, మహిళలకు అండగా ఉండడం చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కి నోటీసులు ఇవ్వడం ద్వారా ఆయనని రాజకీయంగా దెబ్బ తీయాలన్న ఉద్దేశ్యమే ఇందులో ఉంది అన్న విమర్శలు వస్తున్నాయి.
గతంలో కూడా తన మీద దురుసుగా మాట్లాడాలీ అని చంద్రబాబు, బోండా ఉమల మీద వాసిరెడ్డి పద్మ నోటీసులు ఇచ్చారు. ఏది ఏమైనా ఇపుడు వైసీపీకి మూడు రాజధానుల కంటే కూడా అతి పెద్ద టాపిక్ గా మూడు పెళ్ళిళ్ళు అయిపోయాయా అని కామెంట్స్ వచ్చి పడుతున్నాయి.