Begin typing your search above and press return to search.
గర్జనను ఊదేసిన పవన్...లాస్ట్ పంచ్ సేనానిదే...?
By: Tupaki Desk | 17 Oct 2022 2:30 AM GMTవిశాఖ గర్జన అంటూ గత కొన్ని రోజులుగా ముప్ప తిప్పలు పడి వైసీపీ పెద్దలు ఎట్టకేలకు విశాఖ వీధుల్లో గర్జన నిర్వహించారు. దీని కోసం ఉత్తరాంధ్రా అంతా ఒక్కటిగా అయితేనే జనాలు వచ్చారు. కానీ జోరున జడివాన కురిసి ప్రకృతి కూడా బ్రేకులేయడానికే చూసింది. మొత్తానికి గర్జన అయిందనిపించారు వైసీపీ పెద్దలు. జనాలు కూడా ఫరవాలేదు అన్నట్లుగా రావడంతో సక్సెస్ అని చెప్పుకున్నారు.
అయితే ఆ ఆనందం కాస్తా సాయంత్రానికే ఆవిరి అయింది. విశాఖ ఎయిర్ పోర్టులో జన సైనికులు వైసీపీ మంత్రుల కాన్వాయ్ మీద దాడులు చేశారు అన్న వార్తలతో మీడియా ఫోకస్ అంతా అటు మళ్ళిపోయింది. దానికి తోడు అన్నట్లుగా జనసైనికుల అరెస్టులు జరగడం తో టాక్ ఆఫ్ ది ఏపీ అన్నట్లుగా ఆ మ్యాటరే మారుమోగింది . ఇక టీవీ డిబేట్ల నుంచి అన్నీ కూడా దాని మీదనే వాడి వేడిగా చర్చించాయి.
విశాఖలో పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టకపోయినా హొటెల్ గదిలో ఉన్నా కూడా ఆయనే విశాఖ అట్రాక్షన్ అయిపోయారు. అదే విధంగా పవన్ని అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపధ్యంలో వేడి వేడిగా ఆ వార్తలే జనాల్లోకి వెళ్ళి చర్చకు వస్తున్నాయి. దాంతో వైసీపీ కౌంటర్లు కూడా దానికే పరిమితం అవుతున్నాయి.
పవన్ విశాఖలో నిర్వహించ తలపెట్టిన జనవాణి కార్యక్రమం వేదిక ముందు వైసీపీ వారు ఆందోళన చేయడంతో ఇష్యూ మొత్తం పవన్ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. దాంతో గర్జన హుషార్ అంతా పవన్ మానియా ఉఫ్ అని ఊదేసినట్లు అయింది. ఇపుడు అక్రమ అరెస్టులు అంటూ జనసేన నేతలు మండిపడుతున్నారు. అరెస్ట్ అయిన వారు బెయిల్ మీద విడుదల అయితే మాత్రం కచ్చితంగా జనసేనకు అది భారీ విజయం అవుతుంది.
ఇక విశాఖ సెక్షన్ 30 అంటూ హడావుడిగా విధించిన సెక్షన్ మీద కూడా జనసేన కోర్టుకు వెళ్లబోతోంది. పవన్ విశాఖ పర్యటనకు కార్యక్రమాలకు కోర్టు నుంచి అనుమతి లభిస్తే కనుక వైసీపీ సర్కార్ మీద జనసేనది ఘన విజయమే అవుతుంది. మొత్తానికి చూస్తే మూడు రాజధానులు విశాఖ గర్జన అంటూ నానా హడావుడి చేసిన వైసీపీ మీద విశాఖలో పవన్ లాస్ట్ పంచ్ వేసి తనదే పై చేయి అనిపించుకోవడం ఖాయమంటున్నారు జనసైనికులు. సో వైసీపీకి ఈ టోటల్ ఎపిసోడ్ లో అక్రమ అరెస్టులు చేశారన్న చెడ్డ పేరుతో పాటు గర్జన ఊపు హుషార్ కూడా లేకుండా పోతున్నాయన్న బెంగ అయితే పట్టుకుంది.
ఇదంతా సరైన ప్లానింగ్ వ్యూహాలు లేని కారణంగా దూకుడు చేయడం వల్లనే అని అంటున్నారు. మంత్రుల దాడి ఘటన మీద పూర్తిగా విచారించి అసలైన బాధ్యుల మీద కేసులు పెడితే సరిపోయదని అలా కాకుండా జనసేన అన్న ప్రతీ నాయకుడి మీద కేసులు పెట్టి పోలీసులు అతి ఉత్సాహం చూపించారు అని ఆరోపణలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.