Begin typing your search above and press return to search.
ప్రెస్ మీట్లో వైసీపీని చీల్చి చెండాడిన పవన్
By: Tupaki Desk | 16 Oct 2022 9:30 AM GMTమూడు రాజధానులకు అనుకూలంగా విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 'విశాఖ గర్జన' ఏర్పాటు చేసిన రోజే జనసేనాని పవన్ కళ్యాణ్ 'జనవాణి' కార్యక్రమం కోసం వైజాగ్‌లో అడుగు పెట్టడం.. ఆయన పర్యటనకు అడుగగడుగునా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయడం.. కనీసం రోడ్ షోలో పవన్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకోవడం, అలాగే పవన్ ర్యాలీగా సాగిన రోడ్లు, వీధుల్లో లైట్లు కూడా ఆపేయడం, అర్ధరాత్రి దాటాక పవన్ బస చేస్తున్న హోటల్లోకి పోలీసులు చొరబడి జనసేన నేతలు పలువురిని కారణం లేకుండా అరెస్టు చేయడం ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. ఈ పరిణామాలపై పవన్ కళ్యాన్ ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ సర్కారు తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టాడు. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ పవన్ సంధించిన ప్రశ్నలకు, వ్యక్తి చేసిన అభ్యంతరాలకు వైసీపీ అసలు సమాధానం ఇచ్చే పరిస్థితుల్లోనే లేదు.
తమ పార్టీ నేతలను విడుదల చేసే వరకు జనవాణి కార్యక్రమం నిర్వహిచనని తేల్చి చెప్పిన పవన్.. అసలు ఈ కార్యక్రమానికి ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించాడు. విశాఖలో జనవాణి కార్యక్రమం గురించి మూడు నెలల కిందటే ప్రకటించామని, విశాఖ గర్జన కార్యక్రమం ప్రకటనకు మూడు రోజుల ముందే ప్రయాణానికి టికెట్లు కూడా బుక్ చేశామని, మరి దానికి పోటీగా తాము రంగంలోకి దిగారని ఎలా అంటారని పవన్ ప్రశ్నించాడు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తున్నట్లయితే.. జనం తమ బాధలు చెప్పుకోవడానికి తమ పార్టీ దగ్గరికి ఎందుకు వస్తున్నారని, జనవాణి కార్యక్రమం గురించి అసలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని పవన్ ప్రశ్నించాడు.
తాను కారు ఎక్కి అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తే.. దాన్ని కూడా అడ్డుకోవడం ఏంటని, ఇందులో ఏం తప్పుందని పవన్ ప్రశ్నించాడు. అర్ధరాత్రి మూడున్నరకు వచ్చి కారణం లేకుండా తమ పార్టీ నేతలను అదుపులోకి తీసుకోవడం ఏంటని.. తన కారు తాళాలు కావాలని అడిగారని.. ఆ అవసరం ఏమొచ్చిందని, తన కారుతో ఏం పని అని పవన్ అడిగాడు. పోలీసులను ఎలా ఎదుర్కోవాలో తమకు చేత కాక, వారికి సమాధానం చెప్పలేక తాము మౌనంగా లేమని, కేవలం పోలీసు శాఖ మీద గౌరవంతో సైలెంటుగా ఉన్నామని పవన్ అన్నాడు. పోలీసు శాఖ అంటే ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి సీఎం స్థానంలో ఉన్నాడని పవన్ విమర్శించాడు. అసలు అధికారంలో ఉన్న వాళ్లు గర్జించడం ఏంటని.. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి, జనాల్ని రెచ్చగొట్టడానికే ఇలా కార్యక్రమాలు చేస్తున్నారని పవన్ అన్నాడు.
బూతులు తిట్టడానికి మాత్రమే వికేంద్రీకరణ అని పవన్ విమర్శించారు. కులాల పేరుతో కార్పొరేషన్లు ఉన్నా.. నిధులు ఇవ్వడంలేదన్నారు. స్థానిక సంస్థలకు నిధుల విడుదలపై ఒక్కరు మాత్రమే నిర్ణయిస్తారని, క్రిమినల్స్‌ని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని అన్నారు. రాజకీయాల్లో క్రిమినల్స్‌ను ఎదుర్కోవడంలో... తన ప్రాణాలు పోయినా పర్వలేదన్నారు. తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతామని.. కులస్వామ్యాన్ని ఏకవ్యక్తిస్వామ్యన్నా నమ్మమని అన్నారు. అరెస్ట్ చేసిన తమ కార్యకర్తలను విడుదల చేసేవరకు జనవాణి కార్యక్రమం చేపట్టమని స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన తమ కార్యకర్తల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోనసీమ లాంటి గొడవలు జరగాలని ప్రభుత్వం కోరకుంటోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
వికేంద్రీకరణపై పవన్ స్పందిస్తూ.. సీఎం జగన్ మీద వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ''ముఖ్యమంత్రి ఒక్కరే అధికారం చెలాయించాలి కానీ.. రాజధానులు మాత్రం మూడు కావాలి. రాజధాని వికేంద్రీకరణ కావాలి.. కానీ అధికార వికేంద్రీకరణకు మాత్రం ఒప్పుకోరు. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే.. మిగతా వాళ్లు వికేంద్రీకరణపై మాట్లాడతారు. సీఎం నిర్ణయాల వల్ల రాష్ట్రం నుంచి గత ప్రభుత్వంలో వచ్చిన సంస్థలన్నీ రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. ముఖ్యమంత్రి ఒక్కరే తీసుకునే నిర్ణయాల వల్లే అందరికీ ఇబ్బందులు వస్తున్నాయి'' అని పవన్ అన్నాడు.