Begin typing your search above and press return to search.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చేది ఇన్ని సీట్లే: పవన్ జోస్యం!
By: Tupaki Desk | 18 Sep 2022 9:18 AM GMTవచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఒక సర్వే ప్రకారం 47-67 మధ్య మాత్రమే సీట్లు వస్తాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో గానీ.. దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. వైసీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నించేందుకు, సేవ చేసేందుకు వేదిక కావాలని అనిపించిందని.. అందుకే పార్టీని ఏర్పాటు చేశానన్నారు.
గెలిచేవరకు మళ్లీ మళ్లీ దెబ్బలు తినడానికి తాను సిద్ధంగా ఉన్నానని పవన్ తెలిపారు. తన జీవితంలో చేసిన మంచి పని పార్టీ పెట్టడమన్నారు. జనసేన పార్టీకి అంతకంతకూ ప్రజాదరణ పెరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. ఈసారి అసెంబ్లీలో జనసేన పార్టీ జెండా ఎగరాలన్నారు. తమకు అసెంబ్లీలో పది సీట్లు ఉన్నా రాజకీయాలు ఎలా ఉండాలో చూపించేవారమన్నారు.
ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని పవన్ చెప్పారు. అక్టోబర్ 5 నుంచి తాను చేపట్టాలనుకున్న పాదయాత్ర ప్రస్తుతానికి వాయిదా పడిందని పవన్ తెలిపారు. పార్టీ బలోపేతంపై అధ్యయనం పూర్తయ్యాక యాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు. త్వరలో నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తామని వివరించారు. పార్టీ శ్రేణులు పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కోరారు.
2019లో ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీని వదిలేసి తాను పారిపోతానని చాలామంది ఆశించారని... అయితే వారి కోరిక నేరవేరకుండా చేశానని పవన్ కల్యాణ్ చెప్పారు. అణగారిన వర్గాలకు అధికారం దక్కేందుకు కృషి చేస్తున్నానని వెల్లడించారు. తన దగ్గర అపరిమిత ధనం లేదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని పేర్కొన్నారు. ఈ క్రమంలో తన దేశాన్ని, తన నేలను, తన పార్టీని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఏపీకి నేడు రాజధాని అనేది లేకుండా పోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభల్లో మాట ఇచ్చి వెనక్కిపోతే ఇక విలువేముందని నిలదీశారు. వేల ఎకరాలు వద్దు.. చిన్న రాజధాని చాలని అప్పట్లో తాను మిత్రపక్షంగా చెప్పిన మాట వాస్తవమేనన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రాజధానికి 30 వేల ఎకరాలు అవసరం అన్నారని గుర్తు చేశారు. ఇక్కడే ఇల్లు కట్టానని.. అమరావతిని అభివృద్ధి చేస్తానని కూడా జగన్ అన్నారని గుర్తు చేశారు. అసెంబ్లీలో కూడా ఓట్లు వేయించుకున్నాక మాట తప్పి మోసం చేశారని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో వివాదం చేసింది ఎవరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆనాడు అమరావతికి ఒప్పుకొని.. ఇవాళ 3 రాజధానులంటారా? అని జగన్‌పైన పరోక్షంగా మండిపడ్డారు. మాట నిలబెట్టుకోనప్పుడు చట్టాలు అమలు చేసే అధికారం మీకెక్కడిది అని నిలదీశారు.
2014లో తాను టీడీపీకి గుడ్డిగా మద్దతు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల పరిష్కారంపైనే ఆలోచించి.. పెద్దల సూచన మేరకు అప్పుడు టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు.