Begin typing your search above and press return to search.

అసలు కడపకు ఎందుకు వెళ్ళినట్లు ?

By:  Tupaki Desk   |   21 Aug 2022 5:06 AM GMT
అసలు కడపకు ఎందుకు వెళ్ళినట్లు ?
X
కడప జిల్లా సిద్ధవటం గ్రామంలో ఏ మాట్లాడుదామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్ళారో అర్ధం కాలేదు. పవన్ మాట్లాడింది చివరికి అయనకైనా అర్ధమైందా అనే సందేహం పెరిగిపోతోంది. తాను కులాన్ని అమ్ముకోవటానికి రాలేదని, కులాల గురించి మాట్లాడటానికి రాలేదన్నారు. అయితే ప్రసంగంలో ఎక్కువగా కులాల గురించే మాట్లాడారు. రెడ్డి, క్షత్రియ కులాల్లో కూడా పేదలున్నారని పవన్ చెబితేనే సమాజానికి తెలిసింది.

అనంతపురంలోని జగన్ సామాజికవర్గానికే చెందిన జేసీ దివాకరరెడ్డి, మదుసూధనరెడ్డిని కడా అణగదొక్కేసినట్లు మండిపడ్డారు. సొంత చెల్లికి అన్యాయం చేయటంతో ఆమె మరో పార్టీ పెట్టుకున్నారని ఆరోపించారు. అసలు పవన్ ఏమి చెప్పదలచుకున్నారనే విషయంలో క్లారిటి ఉన్నట్లులేదు. ఇక్కడ అర్ధమవుతున్నది ఏమిటంటే జగన్ను టార్గెట్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాత్రం అర్ధమవుతోంది. ఆవు వ్యాసం లాగా తిప్పితిప్పి జగన్ గురించే మాట్లాడారు.

జగన్ గురించి, ప్రభుత్వం గురించి ఆరోపణలు చేయటంలో తప్పులేదు. కానీ ఆ ఆరోపణలకు అర్ధముండాలి. తన అన్న తనకు అన్యాయం చేసినట్లు షర్మిల ఎక్కడైనా చెప్పారా ? ఇక కాంగ్రెస్ లో నుండి జగన్ బయటకు వచ్చేసిన తర్వాత రాజకీయంగా అణగదొక్కటానికే కదా కేసులు పెట్టింది ? కేసులు పెట్టడంలో జగన్ కు వ్యతిరేకంగా ఎంతమంది చేతులు కలిపారో జనాలు చూడలేదా ? 2019 ఎన్నికల్లో పవన్ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడో చూస్తానంటు చేసిన సవాలును ఏమంటారు ?

జగన్ వైసీపీకి ముఖ్యమంత్రి కానీ రాష్ట్రానికి కాదన్న కామెంటుకు పవనే అర్ధం చెప్పాలి. ఇదే పవన్ ఒకపుడు తానసలు జగన్ను ముఖ్యమంత్రిగానే గుర్తించనని చెప్పారు. ఏమిటో ఏదో మాట్లాడాలని సిద్ధవటం వచ్చి నోటికొచ్చింది మాట్లాడేశారు. షూటింగుల్లో ఉన్నట్లు చేతిలో స్క్రిప్ట్ లేకపోవటం వల్లే సంబంధంలేని అంశాలన్నింటినీ కలిపి మాట్లాడేసి జనాలను కన్ఫ్యూజ్ చేసేశారు. ఇకముందైనా ఏ అంశం మాట్లాడదలచుకున్నారో దానికి మాత్రమే పరిమితమై అది కూడా బాగా కసరత్తు చేసి మాట్లాడితే బాగుంటుంది.