Begin typing your search above and press return to search.
పవన్ లో కసి : జనసేన సంగతేంటి...?
By: Tupaki Desk | 17 July 2022 12:30 PM GMTపవన్ కళ్యాణ్ మళ్ళీ జోస్యం చెబుతున్నారు. వచ్చే ఎన్నికల తరువాత ఏపీలో వైసీపీ లేని ప్రభుత్వం వస్తుందని. ఈ జోస్యం తధ్యమని కూడా ఆయన గట్టిగా అంటున్నారు. మరి ఈ జోస్యం ఎంతవరకూ నిజమవుతుందో చూడాల్సి ఉంది కానీ దీనికి ముందు 2019 ఎన్నికల ముందు కూడా ఆయన ఒక జోస్యం చెప్పారు. ఆ జోస్యం ఏంటి అంటే జగన్ ఈ జన్మలో సీఎం కాలేడని. మరి అది జరిగిందా అని వైసీపీ నేతలు ఇపుడు గుర్తుకు తెస్తున్నారు.
పవన్ జోస్యాలు నిజమవడానికి ఆయనకు ఏమి తెలుసు అని కూడా ప్రశ్నిస్తున్నారు. పవన్ ఎంతసేపూ తన పార్టీ గురించి కూడా ఎక్కువగా ఆలోచన చేయకుండా కేవలం వైసీపీ గురించే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మండపేట మీటింగులో ఆయన పూర్తిగా వైసీపీనే టార్గెట్ చేశారు తప్ప టీడీపీని పల్లెత్తు మాట అనలేదని అంటున్నారు. అంటే ఎన్నికల ముందు రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
అందువల్లనే పవన్ కళ్యాణ్ వైసీపీ లేని ప్రభుత్వం అంటున్నారు తప్ప తమ ప్రభుత్వం వస్తుంది అని ధీమాగా చెప్పడంలేదు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ లో ఈ రకమైన రాజకీయ కసి ఉండడం మంచిచే కానీ అది జనసేనకు ఏ మాత్రం ఉపయోగపడడంలేదన్నది గుర్తుంచుకోవాలని అంటున్న వారూ ఉంటారు. పవన్ వచ్చే ఎన్నికల్లో జనసేన గెలవాలని ఒక వైపు చెబుతూనే జనసేన వస్తుందో రాదో తాను ముఖ్యమంత్రి అవుతానో లేదో తెలియదు అంటున్నారని కూడా చెబుతున్నారు.
ఇక ఏపీ అంటే కుల భావన అని పవన్ తాజాగా చేసిన కామెంట్స్ మీద కూడా చర్చ సాగుతోంది. దీనికి ముందు జనసేన నాయకత్వాన జరిగిన జనవాణిలో ఆయన మాట్లాడుతూ ఏపీ మంత్రులలో కుల భావన లేదని చెప్పారని, ఇపుడు ఏపీలో అంతటా కుల భావన ఉందని అంటున్నారని, ఇది పరస్పర విరుద్ధ భావనలే అని విమర్శలు చేస్తున్నారు.
ఇక పవన్ తన మీటింగుల ద్వారా ఏపీలో వ్యతిరెకాత వాతావరణం అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు. కానీ తాను వైసీపీని దించేసి వచ్చే కొత్త ముఖ్యమంత్రిని అని ధీమాగా చెప్పకపోవడం వల్ల అది జనసేనకు ఏ మాత్రం ఉపయోగపడుతుంది అన్నది చూడాలి అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ టీడీపీని పల్లెత్తు మాట అనకపోవడం వల్ల ఈ వ్యతిరేకత కచ్చితంగా టీడెపీఎకే పూర్తి స్థాయిలో ఉపయోపడుతుంది అంటున్నారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ అయినా మరో నేత అయినా తమ పార్టీ గురించి ఎక్కువగా ఆలోచించాలని, కసి పట్టుదల అంతా తాము అధికారంలోకి రావలని చూడాలని సూచనలు అయితే ఉన్నాయి. కానీ పవన్ మాత్రం వైసీపీ రావద్దు అని మాత్రమే అంటున్నారు అంటే కచ్చితంగా 2024 ఎన్నికల్లో జనసేన సంగతేమో కానీ టీడీపీకే భారీ రాజకీయ లాభం చేకూర్తుంది అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి. మరి పవన్ కి కూడా అదే ఇష్టమైతే మాత్రం జనసేన 2014 నాటి పాత్రను పోషించడానికి సిద్ధపడాల్సిందే అంటున్నారు.