Begin typing your search above and press return to search.

పవన్ మాటలు ఎవరికైనా అర్ధమయ్యాయా ?

By:  Tupaki Desk   |   3 July 2022 7:31 AM GMT
పవన్ మాటలు ఎవరికైనా అర్ధమయ్యాయా ?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చాలా ఆశలే ఉన్నాయి. ఆ ఆశలు కూడా మామూలువి కావు. ఏకంగా అధికారంలోకి వచ్చేయాలనే. పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి రావాలని అధినేతలకు ఉండటంలో తప్పులేదు. కాకపోతే అధికారం అందుకోవటానికి అధినేతకు అంత సీనుందా అన్నదే అసలైన పాయింట్. ఇప్పటికిప్పుడు అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేంత సీన్ జనసేన లేదనే అనుకోవాలి.

వీరమహిళల సమావేశంలో పవన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాయన్నారు. ఇంతవరకు తప్పేమీ లేదు కానీ దీని వెనుక అసలు పవన్ ఏమి చెప్పదలచుకున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రాబోతోందని చెప్పటమే పవన్ ఉద్దేశ్యం లాగుంది. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏర్పడే ప్రభుత్వాలు నిలబడవన్నారు.

ఈ పాయింట్ లోనే పవన్ ఏమి చెప్పదలచుకున్నారో అర్ధం కాలేదు. అక్కడ టీఆర్ఎస్ ను రెండోసారి ఏపీలో వైసీపీని జనాలు ఎన్నుకుంటేనే కదా అధికారంలోకి వచ్చాయి. మెజారిటి ఓటర్లు ఓట్లేసి అధికారం అప్పగించారంటేనే ఈ పార్టీలకు జనాల మద్దతుందని అర్ధమవుతోంది కదా. ఇద్దరు ఎంపీల నుండి అధికారం వచ్చేవరకు బీజేపీ పోరాటం చేసిందన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా పవన్ కొత్తగా చెప్పేదేముంది.

ఏ పార్టీ అయినా మొదటి చిన్నగానే మొదలవుతుందట. ఈ మాటకు అర్ధమేంటో పవనే చెప్పాలి. మొత్తానికి పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలైనా పవన్ ఆలోచనల్లో క్లారిటి రాలేదనేందుకు తాజా వ్యాఖ్యలే నిదర్శనాలు. అసలు ఏమి చెప్పదలచుకున్నారు ? ఏమి చెప్పదలచుకుని ఏమి చెప్పారో కూడా జనాలకు అర్ధం కావటంలేదు. పొంతనలేని మాటలు, చెప్పిన మాటలకు కూడా ఒకదానికి మరోదానికి సంబంధంలేకుండా మాట్లాడటం పవన్ కే చెల్లింది. ఎంతకాలమైనా పవన్ మాటల్లో క్లారిటి వచ్చే అవకాశంలేదని వీరమహిళ సమావేశంతో స్పష్టమైపోయింది.