Begin typing your search above and press return to search.

వైసీపీ నేత‌ల‌కు మైండ్ బ్లాంక్‌.. ప‌వ‌న్‌కు క‌నీవినీ ఎరుగ‌ని స్వాగ‌తం!

By:  Tupaki Desk   |   19 Jun 2022 4:30 PM GMT
వైసీపీ నేత‌ల‌కు మైండ్ బ్లాంక్‌.. ప‌వ‌న్‌కు క‌నీవినీ ఎరుగ‌ని స్వాగ‌తం!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీ నేత‌ల‌కు మైండ్ బ్లాంక్ అయింది. అస‌లు ఏమీ ప్ర‌భావం లేద‌ని.. జ‌న‌సేన‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌దే ప‌దే చెప్పే వైసీపీ నాయ‌కులకు దిమ్మ‌తిరిగి పోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను ప‌ట్టించుకుంటున్నార‌ని.. ఆ వ‌ర్గం ఓట్లు త‌ప్ప‌.. మ‌రెవ‌రూ.. ఆయ‌న వెంట కూడా లేర‌ని.. వైసీపీ నాయ‌కులు కామెంట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. అనూహ్యంగా రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గం స‌హా ఎస్సీ ఓట్లు ఎక్కువ‌గా ఉన్న బాప‌ట్ల జిల్లాలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

వైసీపీ హ‌యాంలో ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి సాయం అందని కౌలురైతులు.. ఆర్థికంగా న‌ష్ట‌పోయి.. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌తో చితికి పోయిన నేప‌థ్యంలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం కూడా ఒప్పుకొంటోంది. అయితే.. కౌలు రైతు గుర్తింపు కార్డు ఉన్న‌వారికి మాత్ర‌మే.. ప్ర‌భుత్వం నుంచి ప‌రిహారం ఇస్తామ‌ని.. ఇచ్చామ‌ని.. సాక్షాత్తూ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అయితే.. రైతు అంటే.. రైతే.. గుర్తింపు కార్డు ఉందా లేదా? అనేది ప్రాధాన్యం కాదంటూ.. కౌలు రైతుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌డుం బిగించారు. ఏప్రిల్‌లో కౌలు రైతు భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

ఈ క్ర‌మంలో విడ‌త‌ల వారీగా ఆయ‌న కౌలు రైతు కుటుంబాల‌ను ఆదుకుంటున్నారు. ఆయా జిల్లాల్లో ప‌ర్య‌టించి.. రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి.. ఒక్కొక్క కుటుంబానికి రూ.ల‌క్ష చొప్పున సాయం చేస్తున్నారు. ఇప్ప‌టికే అనంత‌పురం, క‌ర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ప‌ర్య‌టించి.. ఆయా కుటుంబాల‌ను ఆదుకున్నారు. తాజాగా బాప‌ట్ల జిల్లాలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతు కుటుంబాల‌కు సాయం అందించేందుకు ప‌వ‌న్ వ‌చ్చారు. వాస్త‌వానికి ఇక్క‌డ ప‌వ‌న్‌కు ఫాలోయింగ్ త‌క్కువ‌. ఎందుకంటే.. ఉ న్న అన్ని సీట్లు కూడా వైసీపీ కైవ‌సం చేసుకుంది. పైగా రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట్లు ఎక్కువ‌. దీంతో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న తుస్సు మంటుంద‌ని.. వైసీపీ నాయ‌కులు ఆఫ్ దిరికార్డుగా కామెంట్లు కూడా చేశారు.

అయితే.. వైసీపీ నాయ‌కుల‌కు షాక్ ఇచ్చేలా.. ఇక్క‌డి ప్ర‌జ‌లు క‌దిలి వ‌చ్చారు. అడుగ‌డుగునా ప‌వ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. భారీ ఎత్తున త‌రలి వ‌చ్చిన ప్ర‌జ‌లు ప‌వ‌న్ కాన్వాయ్ వెంట కిలో మీట‌ర్ దూరం కాలిన‌డ‌క‌న ముందుకు సాగారు. గ‌జ మాల‌ల‌తో ఆయ‌న‌ను రోడ్డు మీదే స‌త్క‌రించారు. కొంద‌రు ఆర్థికంగా.. త‌మ వంతు అంటూ.. సాయం అందించారు. యువ‌కులు.. మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మంలో ఉంటే.. పెద్ద‌గా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, మ‌హిళ‌లు.. రైతులు.. వృద్ధులు కూడా ప‌వ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌డం.. భారీ ఎత్తున‌క క‌టౌట్లు ఏర్పాట్లు చూస్తే.. వైసీపీ నేత‌ల గుండెల్లో గుబులు నెల‌కొంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.