Begin typing your search above and press return to search.
జనసేనలో జోష్.. ఇక సుడిగాలి పర్యటనలకు పవన్ శ్రీకారం
By: Tupaki Desk | 5 Jun 2022 5:41 AM GMTజనసేన పార్టీలో ప్రస్తుతం పుల్ జోష్ నెలకొంది. వచ్చే ఎన్నికలు, పొత్తులు, పోటీ తదితరాలపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా.. అస్పష్టతకు తావివ్వకుండా స్పష్టమైన ప్రకటన చేసేశారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో తాము ఎట్టి పరిస్థితుల్లో తగ్గబోమని.. ఇప్పటికే తాము చాలాసార్లు తగ్గామని.. ఇక తగ్గాల్సింది మిగతా పార్టీలేనని తేల్చిచెప్పారు. సమాన సీట్లలో పోటీ లేదా వచ్చే ఎన్నికల్లో అధికారం సమానంగా పంచుకోవడమే ఉంటుందన్నారు. లేదా తామే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారు. పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప అని పవన్ తన పంథా ఏంటో చాటి చెప్పేశారు. దీంతో జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానుల్లో నవోత్సాహం చోటు చేసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ మనసులో ఏముందో దానికి తగ్గట్టే పవన్ కూడా చెప్పారని పార్టీ శ్రేణులు సంతోషిస్తున్నాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ జోష్ ను కొనసాగించడానికి జనసేనాని పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతులకు పవన్ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌలు రైతు భరోసా యాత్రను మూడు జిల్లాల్లో ముగించారు. పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన పవన్ ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున తన సొంత నిధులు వెచ్చించి ఆర్థిక సాయం చేశారు.
మరికొద్ది రోజుల్లో కౌలు రైతు భరోసా యాత్రను ప్రకాశం జిల్లాలో చేపడతారని తెలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్ర నుంచి జిల్లాల పర్యటనకు కూడా పవన్ కల్యాణ్ శ్రీకారం చుడతారని సమాచారం. ఉత్తరాంధ్రలో పవన్ కు లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. తూర్పు కాపు సామాజికవర్గం కూడా అధికమే. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పవన్ పర్యటన చేపడతారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లో పవన్ కల్యాణ్ సుడిగాడి పర్యటనలు చేస్తారని జనసేన పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.
ఇప్పటికే పవన్ సోదరుడు, జనసేన ముఖ్య నేత నాగబాబు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పార్టీ నియోజకవర్గ ఇనచార్జులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో పవన్ కల్యాణ్ పర్యటనకు వస్తారని వారికి తెలిపారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన పర్యటనలో ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి, నియోజకవర్గాలవారీగా ఉన్న సమస్యలు, నాయకత్వ గుర్తింపు, ఇన్చార్జులు లేని చోట వారి నియామకం, వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో శ్రేణులకు , దిశానిర్దేశం, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం వంటివి చేస్తారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని పవన్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనలకు ప్రాధాన్యత ఏర్పడింది.
అదే సమయంలో ఓవైపు జిల్లాల పర్యటన చేస్తూనే కౌలు రైతు భరోసా యాత్రను పవన్ కొనసాగిస్తారని చెబుతున్నారు. తద్వారా అన్నదాతలకు అండగా ఉండే ఏకైక పార్టీ తమదేనని చెప్పుకోవడమే పవన్ ఉద్దేశమని అంటున్నారు. ఈ జిల్లాల పర్యటనతో పవన్ మాటలకే పరిమితమవుతారు.. చేతలు ఉండవు అనే అపప్రథ కూడా తొలగిపోతుందని నమ్ముతున్నారు.