Begin typing your search above and press return to search.
కరోనా కారణంగానే బీజేపీతో కలవటంలేదా ?
By: Tupaki Desk | 5 Jun 2022 4:54 AM GMT'కరోనా కారణంగానే జనసేన-బీజేపీ మధ్య భౌతికదూరం పెరిగిపోయింది' ..ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాన్ చేసిన వ్యాఖ్యలు. కరోనా సమస్య తగ్గిపోతే బీజేపీతో దూరంకూడా తగ్గిపోతుందన్నారు. వేరే కార్యక్రమాలు ఉండటంవల్ల రాష్ట్రానికి వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవలేకపోతున్నట్లు పవన్ చెప్పటమే విచిత్రంగా ఉంది. జాతీయ నాయకులతో తాను మాట్లాడుతునే ఉన్నట్లు చెప్పారు.
పవన్ మాటలు ఎంత అబద్ధాలో అందరికీ అర్ధమైపోతోంది. బీజేపీ నేతలతో దూరానికి కరోనా వైరస్ కారణం ఏమాత్రం కానేకాదు. ఎందుకంటే కరోనా కారణంగా భౌతికదూరంపాటించాలన్నది వాస్తవమే. అయితే ఎవరుకూడా భౌతికదూరం పాటించటంలేదు. కరోనా కాలంలోనే పవన్ సినిమా షూటింగులు చేసుకుంటున్నారు. గ్యాప్ లో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ విస్తృతస్ధాయి సమావేశాలు కూడా పెట్టుకుంటున్నారు. ఇన్ని చేస్తున్న పవన్ కు మిత్రపక్షం నేతలతో సమావేశమయ్యేందుకు కరోనా కారణమైందా ?
పేరుకు రెండుపార్టీలు మిత్రపక్షాలే అయినప్పటికీ ఏ పార్టీ ఆపార్టీగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. బీజేపీ కార్యక్రమాలకు జనసేన నేతలు హాజరుకావటంలేదు. జనసేన కార్యక్రమాల్లో బీజేపీ నేతలను పెద్దగా ఆహ్వానించటంలేదు. దీంతోనే రెండు పార్టీల మధ్య బాగా గ్యాప్ వచ్చేసిందని అందరికీ అర్ధమైపోతోంది. పైగా స్ధానిక బీజేపీ నేతలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, కేంద్రంలోని నేతలతోనే తనకు సంబంధాలున్నాయని స్వయంగా పవనే స్పష్టంగా ప్రకటించారు.
అంటే బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అండ్ కోని పవన్ కావాలనే అవమానకరంగా మాట్లాడినట్లు అర్ధమైపోతోంది. జాతీయపార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడిని, రాష్ట్ర నేతలతో తనకు సంబంధాలు లేవని చెప్పటం పవన్లోని అజ్ఞానాన్ని చాటుతోంది. రాష్ట్ర నేతలతో సంబంధాలు లేదని పవన్ ప్రకటించిన తర్వాత కేంద్రంలోని నేతలు మాత్రం పవన్ను ఎలా ఎంటర్ టైన్ చేస్తారు ? మనసులో బీజేపీతో పొత్తులో కంటిన్యు అవ్వటం బహుశా పవన్ కు ఇష్టంలేదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే బీజేపీ నేతలతో కలవటానికి కరోనా వైరస్ ను కారణంగా చూపుతున్నారు.