Begin typing your search above and press return to search.
సేనాని ఒపీనియన్ : మాతో పనేంటంట...?
By: Tupaki Desk | 25 May 2022 2:35 PM GMTజనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగానే రాటుదేలుతున్నారు. లేకపోతే కోనసీమ అల్లర్లు లాంటి అతి సున్నితమైన అంశం విషయంలో విపక్షాన్ని ఇరికించాలని సర్కార్ చేసిన ప్రయత్నాన్ని పవన్ చాలా తెలివిగా లాజిక్ గా తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ కానీ సర్కార్ పెద్దలకు వేసిన ప్రశ్నలు కానీ చాలా క్లిష్టమైనవే. జవాబు చెప్పలేనివి. మరీ ముఖ్యంగా అధికార పార్టీకి మింగుడుపడనివే.
అన్నింటికీ మించి ఆయన అన్నది ఒక్కటే. అసలు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలా వద్దా అన్న దాని మీద మా ఒపీనియం ఇపుడు తాపీగా అడుగుతున్నారు. మేమెందుకు చెప్పాలి అసలు అంటూ కచ్చితంగానే చెప్పేశారు. ఇక్కడ నా అభిప్రాయం ఈ సమయాన అసలు అనవసరం అని కూడా ఆయన అంటున్నారు.
వైసీపీ నేతలు కులాల మధ్య విద్వేషాలు రగిలించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు అని ఆయన అన్నారు. మేము కులాలను కలిపే వాళ్ళం, అంతా ఒక్కటిగా ఉండాలని చూసేవాళ్ళం అంటూ పవన్ జనసేన ఫిలాసఫీ మరోమారు చెప్పారు. మీరు మాత్రం కులాల కుంపట్లు రాజేసి మళ్ళీ మమ్మల్ని లాగాలని చూస్తున్నారు అని పవన్ సీరియస్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన యువత ఎటువంటి భావోద్వేగాలకు లోను కావద్దు అంటూ హితవు పలికారు. మీరు చెప్పాలనుకుంటున్నది చెప్పండి అని కూడా సలహా ఇచ్చారు. ఇక కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టే విషయంలోనే ప్రభుత్వం రాజకీయ వ్యూహాలతో వచ్చిందని కూడా పవన్ అన్నారు.
అలాగే నెల రోజులు టైమ్ ఇవ్వడం వెనక ఉన్న ఉద్దేశ్యమేంటి అని నిలదీశారు. అలాగే మిగిలిన జిల్లాలతో పాటే అంబేద్కర్ పేరుని కొనసీమ జిల్లాకు ఎందుకు మొదట్లో పెట్టలేదని కూడా కడిగేశారు. అదే విధంగా అంబేద్కర్ పేరుని కేవలం ఒక జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తామా అంటూ ఆయన సూటింగానే వైసీపీ సర్కార్ సంకుచిత రాజకీయాలను కెలికి వదిలిపెట్టారు. మొత్తానికి పవన్ తో మామూలు విషయం కాదు సుమా అనిపించేశారు.