Begin typing your search above and press return to search.

తగ్గేది లే... పవనే సీఎం... ?

By:  Tupaki Desk   |   14 March 2022 1:30 PM GMT
తగ్గేది లే... పవనే సీఎం... ?
X
పవన్ కళ్యాణ్ సీఎం. కాబోయే ముఖ్యమంత్రి. పవర్ స్టార్ ఏపీ పొలిటికల్ స్టార్. గుంటూరు జిల్లాలోని ఇప్పటంలో ఇపుడు బిగ్ సౌండ్ ఇదే. జనసేన ఆవిర్భావ సభలా లేదు, పవన్ సీఎం అయిన వేళ నిర్వహించే విజయోత్సవ సభలా ఉంది. గతానికి ఇప్పటికీ పూర్తి భిన్నం ఇప్పటం సభ అంటున్నారు అంతా. గతంలో పవన్ని చూస్తే ఈలలు, గోలలూ. కానీ ఈసారి మాత్రం పవన్ సీఎం అవుతారు. అది జరగాల్సిందే అన్న కసితో జనసైనికులు ఎక్కడ చూసినా కదం తొక్కుతున్నారు.

ఇక ఇప్పటం అంతా జనసంద్రమైన వేళ ఒకే ఒక మాట అందరి నోట. పవన్ అధికారంలోకి వచ్చి తీరుతారు అన్నదే ఆ మాట. మరి ఈ సభ ద్వారా దిశా నిర్దేశం చేస్తామని రాష్ట్ర రాజకీయాలను మారుస్తామని పవన్ చెప్పిన మాటలకు జనసైనికులు ఇస్తున్న స్లోగన్స్ కి మధ్య సంబంధం ఏమిటి అన్నది ఊహించుకుంటే ఏపీలో జనసేన వచ్చే ఎన్నికల్లో సృష్టించే కలకలం మామూలుగా ఉండదు అనే అంటున్నారు.

జననసేన గెలవాల్సిందే. పవన్ సీఎం కావాల్సిందే. ఈ విషయంలో మేము తగ్గేది లే అని జనసైనికులు అంటున్న వేళ ఏపీలో పొత్తుల రాజకీయాలు కూడా కీలక మలుపులు తీసుకునే అవకాశం కచ్చితంగా ఉంది అంటున్నారు. పవన్ సీఎం అన్నది దశాబ్దాల కల. ఈసారి దాన్ని సాకారం చేసుకోవాలన్న ఆరాటం అయితే జనసైనికులకు ఉంది. ఏదో మొక్కుబడిగా కొన్ని సీట్లు ఇచ్చేసి టీడీపీ లాంటి పార్టీలు జనసేన మద్దతు తీసుకుని అధికారంలోకి వద్దామనుకుంటే కుదిరేది కాదని క్యాడర్ అయితే క్లారిటీగా చెబుతోంది.

ఇక ఇప్పటం కి వచ్చిన క్యాడర్ మనోభావాలు ఎలా ఉన్నాయీ అంటే ఒకసారి చంద్రబాబు సీఎం అయ్యారు, మరోసారి జగన్ అయ్యారు. ఈసారి అంటే మూడవసారి కచ్చితంగా చాన్స్ పవన్ దే. ఇదే న్యాయం. ఇదే ధర్మం. ఇదే విధానం అని అంటున్నారు. ఇక జనసేన ఆవిర్భావ సభలో వేదిక మీద్ మాట్లాడిన నేతల మాటలు కూడా ఏపీకి ఈ రోజు ఎలాంటి కళాకాంతీ లేదు. దాన్ని తెచ్చి పెట్టే సత్తా, ఏపీకి పూర్వ వైభవం తెచ్చేది కచ్చితంగా పవన్ కళ్యాణే అంటున్నారు.

మరి దీన్ని బట్టి చూస్తూంటే ఏపీలో వైసీపీ గద్దె దిగితే ఎక్కేది పవర్ స్టార్ మాత్రమే నో చాయిస్ అన్న మాటనే వారు అంటున్నారు. అభిమానంతో అంటున్నా దాని వెనక ఆవేశం, కసి కూడా ఉంది. మరి జనసైనికుల ఆకాంక్షలను ఎవరూ ఆపలేరు. వారి కోరికను మన్నించాలంటే జనసేన తన రాజకీయాన్ని, పొత్తుల రాయబేరాలను కూడా సరికొత్తగా మలుపు తిప్పాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.