Begin typing your search above and press return to search.
సీబీఎన్ దత్తపుత్రుడు అంటే...సీబీఐ దత్తపుత్రుడు అంటా...
By: Tupaki Desk | 12 April 2022 3:59 PM GMTరాజకీయాల్లో మాటకు మాట తూటాల్లా పేలాల్సిందే. లేకపోతే క్యాడర్ సైతం ఒప్పుకోదు. మాటలు తింటూ కూర్చోవడానికి ఇది మహాత్ముడు కాలం నాటిది కాదు. ఇక పాలిటిక్స్ లో విలువలు అన్నీ కూడా తగ్గి పూర్తిగా వారిని వీరూ వీరిని వారూ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్న నేపధ్యంలో ఎవరూ తమను గుచ్చినట్లు మాట్లాడినా అలా ఉంచేసుకోకూడదు, తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే తల బరువెక్కిపోతుంది.
రాజకీయాల్లో పవన్ మాటలు గట్టిగానే ఉంటాయి. ఆయన మీటింగ్ పెట్టారు అంటే అధికార పార్టీ మీద బాణాలు ఎక్కుపెడతారు. ఈ మధ్య ఆవిర్భావ సభలో పవన్ చేసిన ప్రసంగానికి కొద్ది రోజులు ఆగి జగన్ పల్నాడు జిల్లా సభలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటూ పవన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. అయితే చాలా కాలం తరువాతనే జగన్ పవన్ ఊసు తలచారు.
కానీ దానికి బదులు పవన్ ఇచ్చేశారు. అనంతపురం టూర్ లో ఆయన జగన్ తో సహా వైసీపీ నేతలకు గట్టి సందేశమే పంపించారు. తనను సీబీఎన్ కి దత్తపుత్రుడు అని పదే పదే అంటున్నారు. నాకు సహనం నశిస్తోంది. నేను కూడా అనగలను, ఇపుడు మరో సారి హెచ్చరిస్తున్నా. ఇక మీదట తనను దత్తపుత్రుడు అని అంటే సీబీఐ కి జగన్ దత్తపుత్రుడు అని నేను అనాల్సి వస్తుంది అని కుండబద్ధలు కొట్టారు. వైసీపీలో చాలా మంది నాయకులను సీబీఐ ఇప్పటికే దత్తత తీసుకుంది అని ఆయన సెటైర్లు పేల్చారు.
ఇపుడే కాదు, 2019 ఎన్నికల వేళ కూడా టీడీపీకి మేము బీ టీం అని ప్రచారం చేశారు. అనాడు నేను ఊరుకున్నాను, ఏమైనా మాట్లాడితే ఏడుస్తారు అని కూడా వదిలేశారు. నేను కూడా మీరే టీమో అనగలను, చంచల్ గూడా జైల్లో షటిల్ టీమ్ మీది అని అనగలను అని పవన్ తాను అనాల్సింది అనేశారు.
మీరేమైనా దేశం కోసం జైలుకు వెళ్లారా. ప్రజా పోరాటాలు చేసి అక్కడకు వెళ్లారా. మీరు సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ కాదుగా, వారి మాదిరిగా దేశం కోసం జైలుకు వెళ్లడానికి మీరు ఏమి చేశారు అని జగన్ని నిలదీశారు. మీరు ఆర్ధిక నేరాలు చేసి జైలుకి వెళ్లారు. అక్కడ ప్రతీ రోజూ షటిల్ ఆడుతూ పదహారు నెలలు జైలు జీవితం గడిపారు కదా అంటూ సెటైర్లు వేశారు. ఇక నైతిక విలువలు మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మమ్మల్ని విమర్శించాల్సిన పరిస్థితి అంతకంటే లేదు. మీరు మా గురించి మాట్లాడే అర్హత కూడా లేదంటూ వైసీపీ హై కమాండ్ మీద గట్టిగానే పవన్ సౌండ్ చేశారు.
మొత్తానికి పవన్ తనలోని ఫైర్ బ్రాండ్ ని అనంతపురం టూర్ లో చూపించారు. 2024 ఎన్నికలకు పవన్ బాగానే ప్రిపేర్ అవుతున్నారు. దానికి నాందిగా ఆవిర్భావ సభ నుంచి ఆయన పొలిటికల్ గా ఫుల్ ఫోకస్ పెట్టేశారు. జగన్ ని ఈ రేంజిలో ఇప్పటిదాకా టీడీపీయే అనలేదు. కానీ ఫస్ట్ టైమ్ పవన్ అనాల్సి వస్తుంది అంటూనే చాలా ఘాటు మాటలు అనేయడం విశేషం. మరి పవన్ కి వైసీపీ మార్క్ రిటార్ట్ ఉంటుందా.