Begin typing your search above and press return to search.

నేను రైతు బిడ్డ‌ను వారి క‌ష్టం తెలుసుకుని వ‌చ్చాను : ప‌వ‌న్ క‌ల్యాణ్

By:  Tupaki Desk   |   12 April 2022 3:14 PM GMT
నేను రైతు బిడ్డ‌ను వారి క‌ష్టం తెలుసుకుని వ‌చ్చాను : ప‌వ‌న్ క‌ల్యాణ్
X
అనంత‌పురం జిల్లా, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం, మ‌న్నీల గ్రామ పంచాయ‌తీలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌టించారు. కౌలు రైతు భ‌రోసా యాత్ర నిర్వ‌హించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల‌కు ఆర్థిక చేయూత ఇచ్చారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. తొలుత బాధిత కుటుంబాల‌ను కలుసుకుని వారి క‌ష్టం తెలుసుకుని చ‌లించిపోయారు.ఆయ‌నేమ‌న్నారంటే...

బాధిత కుటుంబాల‌కు ల‌క్ష రూపాయ‌ల చొప్పున ఇచ్చానంటే ఇదేదో రాజ‌కీయ ల‌బ్ధి కోసం సాయం చేసింది కాదు. రైతు నేప‌థ్యం నుంచి వ‌చ్చిన వాణ్ని. రైతు క‌ష్టం తెలిసిన వాణ్ని.విత్తు నాటడం ద‌గ్గ‌ర నుంచి పంట చేతికి వ‌చ్చేదాకా ఎలాంటి క‌ష్టం ఉంటుందో నాకు తెలుసు. కౌలు రైతులు చాలా మంది గుర్తింపు లేక ప్ర‌భుత్వం నుంచి ఆద‌ర‌ణ లేక గిట్టుబాటు ధ‌ర లేక ప్ర‌భుత్వం ఆదుకోలేని ప‌రిస్థితులు ఏళ్ల త‌ర‌బ‌డి అప్పులు పేరుకుపోయిన సంద‌ర్భంలోఆత్మ‌హత్య‌లు చేసుకుంటున్నారు.

నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్యటించాను. చిన్న,చిన్న బిడ్డ‌లు చ‌దువుకున్న బిడ్డ‌లు వారి క‌ష్టాలు చూస్తుంటే వారి బాధ చూస్తుంటే క‌డుపు త‌రుక్కుపోతోంది. అధికారం ఇచ్చిందే క‌ష్టాల‌లో ఉన్న వారి క‌న్నీరు తుడ‌వ‌డం కోసం..అది తుడ‌వ‌లేనిది ఎంత మెజార్టీ వ‌స్తే ఏం లాభం? ప్ర‌తి వ్య‌వ‌సాయ క్షేత్రంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు వారికి అండ‌గా నిల‌బ‌డి ఉండాల‌నుకున్నాను.

వేల కోట్లు ఉన్నాయ‌ని కాదు సినిమాలు చేస్తేనే డ‌బ్బులు వ‌స్తాయి. ఒక స‌మాజం చాలా ప‌రిప‌క్వ‌త చెందింది అన‌డానికి అట్ట‌డుగు అణ‌గారిని వ్య‌క్తులను మ‌నం ఎలా చూస్తాం అన్న‌ది ఆ స‌మాజం తాలుకా వ్య‌క్తిత్వంపై ఆధార‌ప‌డి ఉంటుంది. అన్నం పెట్టిన రైతుకు కులం ఉండ‌దు. కౌలు రైతుకు కులం ఉండ‌దు. నేను మాట‌ల మ‌నిషి ని కాదు.

మీరు క‌న్నీరు కారిస్తే ఓ క‌న్నీటి చుక్క తుడిస్తే చాలు. ఆత్మ హ‌త్య ఏ ప‌రిస్థితుల్లో ఆలోచిస్తారో అన్న సంగ‌తి తెలుసు..ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, అప్పులు పెరిగిపోయి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని అనుకుంటారు. ఒకప్పుడు నేను ఇంట‌ర్ నేను బాగా చదువుకోలేన‌ప్పుడు ఆత్మ‌హ‌త్య చేసుకుంటే బాగుండు అని అనుకున్నాను.

కానీ సోద‌రుడు నాగ‌బాబు కార‌ణంగా ఆ ఆలోచ‌న‌ను విర‌మించుకున్నాను. ద‌య‌చేసి ఎవ్వ‌రూ ఇలాంటి ఆలోచ‌న‌లు చేయ‌కండి. మీ క‌ష్టాల్లో మేం ఉన్నాం మే క‌ష్టాల్లో భుజం కాస్తాం. దీని వ‌ల్ల ఓట్లు ప‌డ‌తాయి అని కాదు. నా కుల‌మా అని కాదు సాటి మ‌నిషా కాదా అన్న‌ది చూస్తాను. ఇవాళ నేను ఓ మైనార్టీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించాను. అక్క‌డ హ‌లీమా, హ‌సీనా, భాషా అనే బిడ్డ‌ల‌ను నేను చూశాను. వారి ఆశ‌లు విన్నాను.

అలాంటి వారి ఆకాంక్ష‌లు నెరవేరేందుకు తొలి విడ‌త‌గా 30 బాధిత కుటుంబాల‌కు ఒక్కో కుటుంబానికి ల‌క్ష రూపాయ‌లు చొప్పున 30 ల‌క్ష‌లు మొద‌టి విడ‌తలో ఇచ్చాను. వారి క‌ష్టాల‌ను తీర్చేందుకు ఇక్క‌డున్న నాయ‌కుల‌తో సంప్ర‌తింపులు జ‌రిపాను, వారి బాధ్య‌త తీసుకోవ‌డం కోసం మేం అంతా ఆలోచించి నిర్ణ‌యించాను.

భ‌విష్య‌త్ లో వారు ఏం చదువుకోవాల‌న్నా చ‌దివిస్తాను. హ‌లీమా కానీ హ‌సీనా కానీ ఎస్సై కావాల‌నుకుంటే అందుకు త‌గ్గ చ‌దువు చ‌ద‌వాల‌నుకుంటే చ‌దివిస్తాను. చ‌నిపోయిన కౌలు రైతుల కుటుంబాల సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేస్తాను. దాంట్లో స‌గం డ‌బ్బులు నేను ఇస్తాను. మిగ‌తా స‌గం మా నాయ‌కులు ఇస్తారు. ప్ర‌తి జిల్లాకూ సంక్షేమ నిధి త‌ర‌ఫున సాయం ఉంటుంది..అని మాట ఇచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్.