Begin typing your search above and press return to search.

రూ.5 రూ.10 టికెట్ పెట్టుకోండి.. థియేట‌ర్ల‌న్నీ వైసీపీ వాళ్ల‌వే!-ప‌వ‌న్

By:  Tupaki Desk   |   29 Sep 2021 11:46 AM GMT
రూ.5 రూ.10 టికెట్ పెట్టుకోండి.. థియేట‌ర్ల‌న్నీ వైసీపీ వాళ్ల‌వే!-ప‌వ‌న్
X
ప్ర‌స్తుతం ఏపీలో టిక్కెట్టు స‌మ‌స్య హీటెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. పెద్ద హీరోలు ప‌న్నులు ఎగ్గొడుతున్నారంటూ ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌పై సీరియ‌స్ గా ఉండ‌డం.. ఆన్ లైన్ టికెటింగ్ పోర్ట‌ల్ తో బ్లాక్ మార్కెటింగ్ ని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం... స‌ర్వ‌త్రా హీట్ పెంచుతోంది.

అయితే దీనిపై ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంతో సీరియ‌స్ గా ఉన్నారు. గ‌డిచిన కొంత‌కాలంగా ఏపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవ‌లే టిక్కెట్ ధ‌ర‌ల నియంత్ర‌ణ .. ప్ర‌భుత్వం చేతుల్లోకి వెళ్లడాన్ని ప‌వ‌న్ నిల‌దీశారు. ఈ నిర్ణ‌యం సరికాద‌ని పరిశ్ర‌మ‌పై వేలాది కార్మికులు ఆధార‌ప‌డి బ‌తుకుతున్నార‌ని అంద‌రి పొట్టా కొట్టిన‌ట్టు అవుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మంత్రులపై స‌న్నాసి అంటూ సీరియ‌స్ గా తిట్ల దండ‌కం అందుకోవడం తెలిసిందే.

తాజాగా మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియా స‌మావేశంలో టిక్కెట్ రేట్ల‌ను ప్ర‌స్థావిస్తూ త‌న ఆందోళ‌న‌ను కొన‌సాగించారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని మ‌రోసారి నిల‌దీసే ప్ర‌య‌త్నం చేశారు. నాకేమైనా థియేట‌ర్లు ఉన్నాయా? నేనేమైనా థియేట‌ర్ల బిజినెస్ లో ఉన్నానా? అని ప్ర‌శ్నించిన ప‌వ‌న్ .. రూ.5 రూ.10 టికెట్ పెట్టుకోండి.. థియేట‌ర్ల‌న్నీ వైసీపీ వాళ్ల‌వే. కాకినాడ‌.. నెల్లూరులో థియేట‌ర్లు మీవాళ్ల‌వే.. అని వ్యాఖ్యానించారు. గత్యంత‌రం లేక సినిమాల్లోకి వ‌చ్చాన‌ని కానీ సినీప‌రిశ్ర‌మ అంటే అభిమానం ఉంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. కానీ రాజ‌కీయాల్లోకి మాత్రం ప్రేమ‌తో ఆస‌క్తితో వ‌చ్చాన‌ని అన్నారు.