Begin typing your search above and press return to search.
అధికార మదంతో కొట్టుకునే వైఎస్సార్సీపీ నేతలంటే చిరాకు: పవన్ హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 10 July 2022 11:30 AM GMTజనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జోరు పెంచేశారు. పవన్ కల్యాణ్.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు చేస్తూ రెండు పడవల మీద విజయవంతంగా స్వారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాల కంటే రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఓవైపు జనసేన కౌలు రైతు భరోసా యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న పవన్.. మరోవైపు జనవాణి కార్యక్రమం పేరుతో ప్రజల సమస్యలపై ప్రతి ఆదివారం అర్జీలు స్వీకరించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జనవాణి-జనసేన భరోసా రెండో దఫా కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ జూలై 10న ఆదివారం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన మొదటి విడత జనవాణి కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో.. రెండో విడత కార్యక్రమాన్ని విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఇండోర్ హాల్ లో నిర్వహించారు. జనసేన-జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలపై పవన్ కే నేరుగా అర్జీలు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జనసేన పార్టీ తన వంతు కృషి చేస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం సహాయనిధి, ఆరోగ్యశ్రీకి సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నట్లు చెప్పారు. ''ఒక ప్రభుత్వం స్థలం కేటాయించి ఇల్లు మంజూరు చేసింది.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇల్లు కట్టుకునేందుకు రుణం మంజూరు చేసింది.. ఈ క్రమంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వైకాపా నేతలు ఆ భూమిని లాక్కోవాలని చూస్తున్నారు. ఇది అత్యంత దారుణం. 20 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లో నుంచి బాధితులను వెళ్లగొట్టారు. రాష్ట్రంలో నాయకులు ఏం చేస్తున్నారో.. కింది స్థాయి నేతలు కూడా అదే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలే ఎక్కువగా నా దృష్టికి వచ్చాయి" అని పవన్ తెలిపారు.
అధికార మదంతో కొట్టుకుంటారు కాబట్టే వైఎస్సార్సీపీ నేతలంటే తనకు చిరాకు అని చెప్పారు. ఒక నాయకుడు కబ్జాలు చేసి, లంచాలు తీసుకుంటే భరించగలం. కానీ ఆ నాయకుడి లక్షణాలు గ్రామ స్థాయి నాయకుల వరకు చేరితే.. ఎక్కడ చూసినా మినీ వైఎస్సార్సీపీ అధినేతే ఉన్నట్లు అవుతుంది. విశాఖలో కనిపించిన కొండనల్లా మింగేస్తున్నారు. ఈ అన్యాయాలు ఇప్పుడు అడ్డుకోకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ఏ ఎంపీటీసీ సభ్యుడైతే స్థలాన్ని లాక్కున్నాడో బాధితులకు తిరిగి ఇప్పించాలి. ఈ బాధ్యత మంత్రులు తీసుకోవాలి. ఇలాంటి పనులు చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలు చేస్తే.. తీవ్ర ఉద్యమాలే వస్తాయి. దౌర్జన్యాలు పెరిగితే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారు. ప్రజలు మిమ్మల్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తారు'' అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.