Begin typing your search above and press return to search.

తెలంగాణ‌పై ప‌వ‌న్ కామెంట్లు.. క్లారిటీ మిస్స‌య్యారే!

By:  Tupaki Desk   |   9 Oct 2021 2:25 PM GMT
తెలంగాణ‌పై ప‌వ‌న్ కామెంట్లు.. క్లారిటీ మిస్స‌య్యారే!
X
తెలంగాణ రాజకీయాలపై జనసేన పవన్‌కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కష్టమని పవన్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు తనను పిలిచే వరకు ఇక్కడకు రానని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై నుంచే జనసేన పార్టీని ప్రారంబించానని గుర్తు చేశారు. తెలంగాణ సమస్యలపై పోరాడే వారిని అసెంబ్లీకి పంపించటానికి కృషి చేస్తానని ప్రకటించారు. తెలంగాణ పోరాట స్పూర్తి జనసేన పార్టీని స్థాపించేలా చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి తన గుండెలో ధైర్యాన్ని నింపిందని తెలిపారు.

తెలంగాణ భాషను, యాసను తాను గౌరవిస్తున్నానని ప‌వ‌న్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. అడుగుపెడితేనే అనుభవం రాదని వ్యాఖ్యానిం చారు. తలకాయ ఎగిరిపోతుందా.. ఓడిపోతామా.. గెలుస్తామా అని ఆలోచించలేదన్నారు. కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోతాయని, కులాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. కులాల కొట్లాటతో ఏపీ అభివృద్ధి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జన్యం, అవినీతి, పేదరికమే జనసేనకకు బద్దశత్రువులని పేర్కొన్నారు. ఆంధ్ర పాలకులను తెలంగాణ నాయకులు బద్దశత్రువులుగా చూశారని విమర్శించారు. ఏపీలో వైసీపీ నాయకులు తనకు శత్రువులు కాదని, సమస్యలు మాత్రమే శత్రువలని పేర్కొన్నారు. ఏ మతంపై దాడి జరిగినా ఖండిస్తానని పవన్‌కల్యాణ్ ప్రకటించారు.

అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ప‌వ‌న్ ఏం చెప్ప‌ద‌లుచుకున్నారో.. అర్ధం కాలేద‌నేది నెటిజ‌న్ల ఆవేద‌న‌. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌ల‌ను చీల్చి చెండాడిన ప‌వ‌న్‌.. ఒక్క‌సారిగా.. వారు త‌న‌కు శ‌త్రువులు కాద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ యంలో త‌ను తెలంగాణ‌లో పిలిచే వ‌ర‌కు పోటీకి దిగ‌ను.. అని చెప్ప‌డం కూడా స‌రిగాలేద‌ని అంటున్నారు. అస‌లు ఎవ‌రు పెట్ట మంటే.. ఆయ‌న పార్టీ పెట్టారు? అనేది ప్ర‌శ్న‌గా మారింద‌ని చెబుతున్నారు. పోటీ అనేది ఒక రాజకీయ పార్టీని ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తు న్నారా? లేదా..అ నే విష‌యాల‌ను తెలుసుకునేందుకు వినియోగించే అస్త్రంగానే చూడాల్సి ఉంటుంద‌ని.. ఈ విష‌యంలో తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఆహ్వానిస్తే.. పోటీ చేస్తానంటూ.. ప్ర‌క‌ట‌న చేయ‌డం.. ప‌వ‌న్ వ్యూహాన్ని చూపించ‌డం లేద‌ని అంటున్నారు.

ఇక‌, ఏపీని తెలంగాణ ప్ర‌భుత్వం శ‌త్రువుగా చూసింద‌ని అంటున్న ప‌వ‌న్‌.. దిగువ రాష్ట్రాన్ని ఎగువ రాష్ట్రం ఎప్పుడూ.. అలానే చూస్తుందని.. పైగా విభ‌జ‌న గాయాల‌తో ఈ రెండు రాష్ట్రాలూ స‌త‌మ‌తం అవుతున్న ప‌రిస్థితి ఉంద‌ని.. కానీ.. ఆయా విష‌యాల‌ను మ‌రిచిపోయి.. ప‌వ‌న్ వ్యాఖ్యానించ‌డం.. వింత గొలుపుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తెలంగాణ‌పై ఇప్ప‌టికీ ప‌వ‌న్‌కు క్లారిటీ లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.