Begin typing your search above and press return to search.
టీజర్ వదిలారు...సీక్రెట్ కంటిన్యూ చేశారు
By: Tupaki Desk | 8 Jan 2023 10:37 AM GMTఆ ఇద్దరూ కలిసి ఈ ఆదివారం మల్టీ స్టారర్ పొలిటికల్ మూవీని చూపించారు. ఒక విధంగా చూస్తే ఇది ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే సంఘటనే. ఈ భేటీ కూడా ఏకంగా రెండున్నర గంటల పాటు సాగింది అంటే వెరీ సీరియస్ అనే చెప్పాలి. మరి ఇంతటి సుదీర్ఘ భేటీలో చంద్రబాబు పవన్ ఏమి మాట్లాడుకుని ఉంటారు అంటే చాలా చాలా అని అంటున్నారు. అయితే వాటిని ఇపుడే మీడియాకు రివీల్ చేయడానికి ఇద్దరు నేతలు ఇష్టపడినట్లుగా లేదు.
కానీ సూత్రప్రాయంగా మాత్రం తాము ఒక్కటి పొత్తులు క్లియర్ అని ఒక సంకేతాన్ని అయితే రెండు పార్టీలతో పాటు ఏపీ రాజకీయానికి సక్సెస్ ఫుల్ గా పంపించేశారు. కేవలం జీవో నంబర్ 1 అన్న ఒక్క దాని గురించే చర్చించుకోవడానికి ఇంతటి సుదీర్హ్గమైన సమయం అవసరం లేదు అని అంటున్నారు. కుప్పంలో బాబును వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అని పరామర్శకు వచ్చానై పవన్ చెప్పినా ఆ మాటలు మంతీ అంతా కూడా పావుగంటలో పూర్తి అయ్యేవే.
మరి మిగిలిన సమయం అంతా దేని మీద చర్చించి ఉంటారు అంటే ఎవరి ఊహకు వారు విశ్లేషించుకోవాల్సిందే అని అంటున్నారు. అయితే ఈ భేటీ తరువాత బాబు పవన్ సరికొత్త ఉత్సాహంతో మీడియా ముందుకు వచ్చారు. అదే విధంగా తాము ఏపీలో కొత్త రాజకీయానికి తెర తీస్తున్నట్లుగా వారు చెప్పుకునే ప్రయత్నం చేశారు. పొత్తుల విషయం ఇపుడే కాదు అని అంటున్నారు కానీ తమ పార్టీల మధ్య పొత్తు ఏమిటి అసలు ఆ ఆలోచనే లేదు అని ఏ మాత్రం ఖండించడంలేదు.
అది పవన్ అయినా చంద్రబాబు అయినా కూడా పొత్తుల మీద సైలెంట్ గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే సరైన సమయంలో తమ వ్యూహాలను బయటపెట్టాలని వారు భావిస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ గతంలో కూడా తెలుగుదేశం మీద ఏ రకమైన విమర్శలు చేయలేదు, చంద్రబాబు కూడా పవన్ని పన్నెత్తి ఒక్క మాట అనలేదు. అంటే ఈ పొత్తుల కంటే ముందు మంచి స్నేహబంధం అయితే ఇద్దరి మధ్యన ఉంది అని అంటున్నారు.
ఇక పవన్ని ఇప్పటంలో అడ్డుకున్నారు అని చంద్రబాబు అంటే కుప్పంలో బాబుని వైసీపీ ప్రభుత్వం కార్నర్ చేసింది అని పవన్ ఆయన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం బట్టి చూస్తే మంచి మిత్రులు వీరిద్దరు కంటే ఎవరు ఉంటారు అని ఆ మాత్రం రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా కలుగక మానదు. ఇవన్నీ ఇలా ఉంటే సరైన సమయంలో పొత్తుల గురించి బయటపెట్టాలని ఇద్దరు నాయకులు భావిస్తున్నట్లుగా అయితే ప్రచారం సాగుతోంది.
మొత్తానికి ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలని అంటున్నారు. పొత్తులు రెండు పార్టీల మధ్య కుదరడం ఖాయం. అది ఎపుడు అఫీషియల్ గా బయట పెడతారు అన్నది ఆ ఇద్దరు నాయకుల ఆలోచనలను బట్టి వారి వ్యూహాలను బట్టి ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. సో పవన్ బాబు భేటీలో మాత్రం మీడియాకు కావాల్సినంత మసాలా అయితే దొరికింది. ఎవరొ ఆలోచనా పరిధి మేరకు ఎవరి అంచనాల మేరకు ఎంతైనా రాసుకోవచ్చు. ఇక చిత్రమేంటి అంటే వైసీపీ మంత్రులు నేతలు కూడా రెండు పార్టీలు ఒక్కటిగా కలసి వస్తాయని ఫిక్స్ అయిపోవడం. సో డౌట్లు అయితే ఎవరికీ లేవనే ఈ భేటీ చెప్పేసింది అన్న మాట.