Begin typing your search above and press return to search.

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. మరికాసేపట్లో చంద్రబాబుతో పవన్‌ భేటీ!

By:  Tupaki Desk   |   8 Jan 2023 5:30 AM GMT
ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. మరికాసేపట్లో చంద్రబాబుతో పవన్‌ భేటీ!
X
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులు, కందుకూరు, గుంటూరుల్లో తొక్కిసలాట్లో 11 మంది మృతి చెందడం, రాష్ట్రంలో బహిరంగ సభలు, రోడ్‌ షోలు, ర్యాలీలు నిర్వహించుకోనీయకుండా జగన్‌ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్‌ 1, కుప్పంలో చంద్రబాబు తాజా పర్యటనను పోలీసులు అడ్డుకోవడం, చంద్రబాబు ప్రచార వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లిపోవడం, నారా లోకేష్‌ పాదయాత్రను అడ్డుకుంటామని వైసీపీ మంత్రులు ప్రకటించడం వంటి అంశాలు పవన్, చంద్రబాబు మధ్య చర్చకు వచ్చే అవకాశముందని అంటున్నారు.

అలాగే సంక్రాంతి తర్వాత నుంచి పవన్‌ కల్యాణ్‌ వారాహి వాహనంపై రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర చేయనున్నారు. ఇప్పటికే వారాహిని అడ్డుకుంటామని వైసీపీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల సభలు, సమావేశాలు, కార్యక్రమాలు, ర్యాలీలు అడ్డుకోవడానికి జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై చంద్రబాబు, పవన్‌ చర్చిస్తారని చెబుతున్నారు.

జగన్‌ ప్రభుత్వ తాజా వైఖరి, దాన్ని అడ్డుకోవడానికి ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలు కూడా చర్చకు వస్తాయని అంటున్నారు.

ముఖ్యంగా ఇటీవల జగన్‌ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను కలవడం, ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంచనాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పొత్తుల వ్యవహారం కూడా చంద్రబాబు – పవన్‌ మధ్య చర్చకు వస్తాయని పేర్కొంటున్నారు.

అదేవిధంగా ప్రతిపక్షాలనే కాకుండా సినీ రంగాన్ని కూడా ఇబ్బందిపెట్టేలా జగన్‌ వ్యవహరించడం కూడా ఇద్దరు నేతల మధ్య చర్చకు వస్తుందని అంటున్నారు. నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి, మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ వేడుకలకు చివరి వరకు అనుమతులు ఇవ్వకుండా జగన్‌ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం, ముందుగా అనుకున్న వేదికలను మార్చాలని కోరడం వంటి వాటిపైన పవన్, చంద్రబాబు చర్చించవచ్చని అంటున్నారు.

ముఖ్యంగా సభలు, సమావేశాలు, రోడ్‌ షోలు, ర్యాలీలు నిషేధిస్తూ జగన్‌ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్‌ 1పైన ప్రధానంగా చర్చిస్తారని టాక్‌ నడుస్తోంది. అలాగే ముందస్తు ఎన్నికలు, పొత్తుల వ్యవహారం కూడా కీలకంగా చర్చకు వస్తాయని చెబుతున్నారు.