Begin typing your search above and press return to search.
వైసీపిది విధ్వంసం.. జనసేనది వికాసం.. పవన్ మార్క్ పంచ్‌లు
By: Tupaki Desk | 14 March 2022 4:14 PM GMTజనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఆసాంతం పార్టీ కార్యకర్తలు, నాయకులను ప్రోత్స హించే ప్రసంగించారు. దాదాపు ప్రసంగం మొత్తం .. పంచ్‌లతో ఇరగదీశారు.
ముఖ్యంగా వైసీపీ నేతలపై విరుచుపడినప్పు డు.. తమ పార్టీ విషయాలను చెప్పాల్సి వచ్చినప్పుడు.. యువతను ఆకర్షించే కామెంట్లు చేశారు. నీలం రంగు చొక్కా ధరించిన పవన్.. నుదుటన పొడవైన సిందూరం పెట్టుకున్నారు. సభలో ఆసాంతం ఆయన ఒకింత ఉద్రేక పూరితంగా.. మరింత స్పూర్తి దాయకంగా.. ఇంకొంత విశ్లేషణా పరుడిగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అధికార పార్టీ అవలంభిస్తున్న విధానాలను పవన్ తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
అదేసమయంలో భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని కూడా పరోక్షంగా ఆయన చెప్పకనే చెప్పారు. అంటే.. వైసీపీని వ్యతిరేకించే పార్టీ లు.. ఏకైక శక్తిగా మారాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలు వ్యక్తిగత లాభాలను పక్కన పెట్టి.. ప్రజల శ్రేయస్సు కోసం కలిసిరావా లని పిలుపునిచ్చారు.
బీజేపీ తో ఉన్న పొత్తు రీత్యా.. వారు ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం తాను ఎదురు చూస్తున్నట్టు పవన్ చెప్పారు. ఈ రోడ్ మ్యాప్ చూశాక.. వైసీపీని గద్దె దింపే ప్రయత్నాలను ముమ్మరం చేస్తామన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే దిశగానే అడుగులు వేస్తామని..పవన్ వెల్లడించారు.
వైసీపీ నాయకులు అధికారం చూసుకుని బలిసి కొట్టుకుంటున్నారని.. వారి కొమ్ములు విరిచేస్తామని.. పవన్ హెచ్చరించారు. 2024లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు పవన్ వెల్లడించారు.
దీనికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. రాజకీయ పొత్తులు అనివార్యమని..అ యితే.. వీటి గురించి భవిష్యత్తులో ఆలోచిస్తానని పవన్ చెప్పారు. వైసీపీ గూండా గిరిని అడ్డుకుంటామని చెప్పారు. ``కూల్చేది మీరు.. కట్టేది నేను!`` అంటూ రాజధాని అమరావతిపై పవన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడం అంటే.. గుండె సత్తువను పెంచుకోవడమేనని.. పవన్ చెప్పారు. మొత్తంగా చూస్తే.. భారీ సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు.