Begin typing your search above and press return to search.

లోకేష్ ని సైడ్ చేసేసిన పవన్

By:  Tupaki Desk   |   18 Jun 2023 11:03 PM GMT
లోకేష్ ని సైడ్ చేసేసిన పవన్
X
పవన్ కళ్యాణ్ పవర్ అలాంటిది మరి. ఆయనకు ఉన్న గ్లామర్ కూడా అదే. ఆయన బయటకు వస్తే జనాలు అలా వెల్లువలా చేరిపోతారు. ఆయన సభ పెడితే జన సంద్రమే అవుతుంది. వారాహి యాత్ర పేరిట ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తిరుగుతున్న పవన్ ఇప్పటికి మూడు బహిరంగ సభలు పెట్టారు. సభలకు జనం అదిరిపోయే స్థాయిలో వచ్చారు. పవన్ గత వారంగా ఏపీలో ఉంటున్నారు. ఆయన గోదావరి జిల్లాలో స్థానిక వర్గాలతో మీటింగులు పెడుతున్నారు.

ఇవన్నీ కూడా ఇపుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయి. పవన్ స్పీచులలో ఫైర్ ఉంటుంది. ఆయన గతానికి భిన్నంగా కరెంట్ అఫైర్స్ ఎంచుకుని మరీ మాట్లాడుతున్నారు. దాంతో ఆయన రాజకీయం ఏపీలో ఇపుడు సంచలనంగా మారుతోంది. ఒక వైపు లోకేష్ బాబు రాయలసీమ జిల్లాలను దాటి నెల్లూరు జిల్లాకు వచ్చారు. రాయలసీమలో లోకేష్ పాదయాత్ర చేసినపుడు ఎంతో కొంత కవరేజి వచ్చేది.

ఆయన పంచు డైలాగులు ఎన్నో కొన్ని పేల్తే వాటిని మీడియాలో ఫోకస్ చేసేవారు. అయితే పవన్ వచ్చాక మొత్తం సీన్ మారిపోయింది. పవన్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆయన ప్రతీ అడుగూ ఒక సంచలనంగా మారుతోంది. ఆయన మాట డైనమైట్ లా పేలుతోంది. ఆయన ఆవేశం కూడా అగ్గిలా రాజుకుంటోంది. దీంతో టోటల్ మీడియా అటెన్షన్ ని పవన్ సూదంటు రాయిలా లాగేసుకున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీ కూడా పవన్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఫుల్ గా కౌంటర్లు ఇస్తూ ఆయననే హైలెట్ చేస్తోంది. ఇది వ్యూహమో మరోటో తెలియదు కానీ ఒక వైపు చంద్రబాబు కుప్పంలో గట్టిగానే డైలాగులు జగన్ మీద పేల్చినా కూడా వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్ లేదు. ఇక లోకేష్ విమర్శలను అసలు పట్టించుకోవడంలేదు.

పవన్నే గట్టిగా టార్గెట్ చేస్తూ ఆయన్ని ఎలివేట్ చేస్తోంది. ఏపీలో ఫైట్ బిట్వీన్ పవన్ అండ్ జగన్ జనసేన అండ్ వైసీపీ అన్నట్లుగా పొలిటికల్ కలరింగ్ ఇచ్చేందుకు వైసీపీ చూస్తోందా అన్న డౌట్లు వస్తున్నారు. ఏది ఏమైతేనేమి ఏపీలో చూస్తే గత వారంగా టీడీపీ సౌండ్ పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా జనసేన పవన్ ఆయనకు కౌంటర్ ఇస్తూ వైసీపీ ఇలా ఈ రెండు పార్టీలే ఏపీ పొలిటికల్ తెరను పంచేసుకున్నాయా అన్న చర్చ వస్తోంది.

ఇక పవన్ రానంతవరకూ లోకేష్ బాబు రాజకీయ పంచులు పేలుస్తూ ఎక్కడో ఒక చోట మెరిసేవారు. కానీ ఇపుడు పవన్ వచ్చి తానే హైలెట్ అవుతున్నారు. లోకేష్ యాత్ర అసలు ఏపీలో సాగుతోందా సాగితే ఎక్కడా అన్న డౌట్లు వచ్చేలా ఏపీ పాలిటిక్స్ మీద పవన్ అంతా తామై కమ్ముకున్నారని అంటున్నారు. పవన్ రెండు చోట్లా ఓడారు, ఆయన పార్టీ చిన్నది, తెలుగుదేశం చూస్తే పెద్ద పార్టీ లోకేష్ మంత్రిగా కూడా చేశారు. కానీ పవన్ ముందు లోకేష్ తెలుగుదేశం వార్తలలో కనిపించకుండా పోవడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

ఇక జనాలతో పోల్చినా పవన్ సభలు పోటెత్తుతున్నాయి. స్పీచులలో పవనే బెటర్ గా ఉంటున్నారు. ఏపీలో స్ట్రాంగ్ పాలిటిక్స్ చేసే నేతగా కూడా కనిపిస్తున్నారు. దీంతో ఒక విధంగా యువగళం లోకేష్ ని వారాహి పవన్ తో పోల్చితే పవన్ పొలిటికల్ మూవీ సూపర్ హిట్ అయింది అని అంటున్నారు అంతా.