Begin typing your search above and press return to search.
పవన్ వైరల్ ఫొటో.. సహజమా? షోయా?
By: Tupaki Desk | 14 Dec 2019 7:28 AM GMTఎలక్షన్ల సమయంలో మట్టి పాత్రలో భోజనం చేసి.. గాజు గ్లాసులో టీ తాగి.. పశువులకు మేత వేస్తూ.. తువ్వాయిలను ముద్దాడి.. ఒక అత్యంత సాధారణ వ్యక్తిలా ప్రొజెక్ట్ చేసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరోసారి కామన్ మేన్‌లా తన అభిమానులను ఆకట్టుకున్నారు. విమానం లేటయితే అక్కడే నేలపై పడుకుని వెయిట్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రైతుల కోసం కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేసిన పవన్.. దీక్ష అనంతరం రాజమండ్రికి వెళ్లాలనుకున్నారు. అయితే రాజమండ్రి విమానం లేట్ అవ్వడంతో విమానాశ్రయం వెలుపలే ఓ సాధారణ వ్యక్తిలా పడుకున్నారు. ఉదయం నుంచి దీక్షలో అలిసిపోయిన పవన్.. అన్నీ మరిచి ఇలా తలవాల్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే... కొద్దిరోజులుగా ప్రభుత్వంపై వరుస విమర్శలతో దాడి చేస్తున్న పవన్ కల్యాణ్ ఇలా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ కావడంతో వైసీపీ శ్రేణుల నుంచి విమర్శలు మొదలయ్యాయి. పవన్ షో కోసమే ఇలా చేస్తున్నారంటూ వైసీపీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.